Home horoscope Today Rasi Phalalu 13.01.2023: ఈరోజు రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి మార్పు తప్పదు..!!

Today Rasi Phalalu 13.01.2023: ఈరోజు రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి మార్పు తప్పదు..!!

by Sunku Sravan

Rasi Phalalu 2023: ఒక్కో రాశి వారికీ ఒక్కో రోజు కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి.మరి ఈరోజు ఏ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

Rashi Phalalu and Horoscope Today in Telugu 13.01.2023

Rasi Phalalu 2023

Rasi Phalalu 2023

మేష రాశి :ఈ రాశి వారికీ గ్రహ స్థితి బాగా అనుకూలం ఉంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి కనిపిస్తోంది. ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు. అధ్యాత్మికత పెరుగుతుంది. సంతానంపై శుభవార్తలు వింటారు.

Horoscope Today Telugu

Horoscope Today Telugu

వృషభ రాశి : ఉద్యోగంలో అధికారుల నుండి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పనులు చాలావరకు పూర్తిచేస్తారు. దూర ప్రాంతం నుండి కావలసిన సమాచారం అందుతుంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త ఉంచుకోవాలి.

మిథునరాశి : రాజకీయ రంగాలవారికి బాగుంది. శుభ ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వాములతో విభేదాలు పోతాయి. ఋణాలు తీరుతాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తోంది.

ee-vaaram-rashi-phalalu

కర్కాటకరాశి: ఈ రాశి వారికీ అనుకున్న ఫలితాలు లభిస్తాయి. వ్యాపారులకు బాగుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు.

సింహరాశి:పట్టుదలతో అనుకున్నవి సాధిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

కన్యరాశి : ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. పెళ్లి కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది.

తులరాశి : ఈ రాశి వారికి ఉద్యోగంలో శ్రమ ఉన్నా చివరికి మేలు కలుగుతుంది. ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఉద్యోగానికి సంబంధించి ముఖ్యమైన పనులలో కొన్నింటిని శ్రమ మీద పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సన్నిహితుల సూచనలు గ్రహించండి. పిల్లలకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం వస్తుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి అదృష్టం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగానికి సంబంధించి మంచి కబురు వింటారు. తెలిసినవారితో వివాహ సంబంధం కుదురుతుంది. స్నేహితులకు సహాయం చేస్తారు.

మకర రాశి: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బంది ఉండదు. ముఖ్యమైన పనుల్లో త్వరితగతిన విజయాలు అందుతాయి. బంధుమిత్రుల సాయం అందుతుంది. వ్యాపారులు విజయాలు సాధిస్తారు.

కుంభరాశి : ఈ రాశి వారికి ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.

మీన రాశి: ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆరోగ్యం పరవాలేదు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

Also Read: ఈ 4 తప్పులకి దూరంగా ఉంటే.. లక్ష్మీ దేవి మీ ఇంట ఉంటుంది..!

You may also like