ఇండియా, ఆస్ట్రేలియా మధ్యలో… జ్యోతిష్యం ప్రకారం వరల్డ్ కప్ కొట్టే జట్టు ఇదేనా..?

ఇండియా, ఆస్ట్రేలియా మధ్యలో… జ్యోతిష్యం ప్రకారం వరల్డ్ కప్ కొట్టే జట్టు ఇదేనా..?

by Mounika Singaluri

Ads

మరో రెండు రోజుల్లో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఇప్పటికే 150 కోట్ల మంది భారతీయులు ఇండియా మరోసారి వరల్డ్ కప్ నెగ్గాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పలువురు 2011లో ఇండియా వరల్డ్ కప్ నెగ్గినప్పటి సెంటిమెంట్లను తీసుకువచ్చి ఈసారి కూడా ఇండియా కచ్చితంగా వరల్డ్ కప్ నెగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

Video Advertisement

ఇప్పటివరకు భారత్ 1983, 2003, 2011లో మూడుసార్లు వరల్డ్ కప్ ఫైనల్స్ కి చేరుకుంది. ఇది నాలుగోసారి భారత ఫైనల్స్ కి చేరడం. ఆస్ట్రేలియా కూడా ఫైనల్స్ ఆడిన అనుభవం ఉన్న జట్టు. రెండు కూడా నువ్వా నేనా అన్న రీతిలో పోరాడుతాయి. ఇప్పటికే భారత్ జట్టు అహ్మదాబాద్ చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా కూడా శుక్రవారం అహ్మదాబాద్ చేరి ప్రాక్టీస్ ప్రారంభిస్తుంది.

india అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలిచేది ఎవరు అంటూ ఇప్పటికే పలువురు ప్రిడిక్షన్ లు స్టార్ట్ చేస్తున్నారు. సెంటిమెంట్లు ప్రకారం కొందరు, జాతకాల ప్రకారం కొందరు గెలిచేది ఈ టీం అంటూ కుండబద్దలు కొడుతున్నారు.ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ పండిట్ జగన్నాథ్ గురూజీ తన ఆస్ట్రాలజీని ప్రకారం ఈ వరల్డ్ కప్ లో ఇండియా గెలుస్తుందని తెలిపారు. ఆస్ట్రేలియా టీం జాతకంతో పోలిస్తే ఇండియా టీం జాతకం బలంగా ఉందని అన్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి ఇండియా టీం లో అది కనిపిస్తుందని, ఉత్సాహం, ఆనందం, బలం కలగలిపి ఇండియా టీం ఈ కప్పును సొంతం చేసుకుంటుందని చెప్పారు…ఇక రోహిత్ శర్మ జాతకం కూడా అద్భుతంగా ఉందని 2011లో కెప్టెన్ ఎంఎస్ ధోని వరల్డ్ కప్ సాధించినట్లుగానే 2023 లో రోహిత్ శర్మ కూడా వరల్డ్ కప్ తీసుకొస్తాడని చెప్పారు. అలాగే మిగతా టీం ప్లేయర్ లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్,గిల్, సిరాజ్, బూమ్రా, షమీ ఇలా అందరి ప్లేయర్ ల జాతకాలు కూడా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఆస్ట్రేలియా ప్లేయర్ పాట్ కమిన్స్ జాతకం కూడా బాగానే ఉన్నప్పటికీ రోహిత్ శర్మతో పోలిస్తే అంత ఉత్సాహంగా లేదని అన్నారు.

Also Read:ఆస్ట్రేలియాని ఒడించాలి అంటే సూర్యకుమార్ బదులు… ఈ ప్లేయర్ ని తీసుకోవడమే కరెక్ట్..! ఎవరంటే..?


End of Article

You may also like