మహేంద్ర సింగ్ ధోని భారతీయ క్రికెట్ కి ఎంతో సేవ చేసాడు..ప్రపంచ కప్ నుంచి టెస్టుల్లో టీం ని నెంబర్ వన్ గా నిలబెట్టే వరకు తాను చేసిన కృషి అంతా ఇంతా కాదు..2019 ప్రపంచ కప్ సెమి ఫైనల్ లో దురదసృష్టవశాత్తు ధోని రనౌట్ అవటం. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్ కి ధోని దూరమవ్వటం జరిగాయి. ‘ధోని మీద విమర్శలు సైతం వెల్లువెత్తాయి రిటైర్ అవ్వమని ఒత్తిళ్లు పెరిగాయి.
ఇక ధోని తిరిగి టీం ఇండియా కి ఆడేది కష్టమే అనుకున్నారు అందరూ…ఐపీఎల్ లో అతని ఆట ని చూసి జట్టులో పునరాగమనం ఉంటుంది అనుకున్నారు అందరూ..కానీ కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడం.ఐపీల్ వాయిదా పడటం జరుగుతూ వచ్చింది.ఇండియా లో ఇంటెర్నేషల్ మ్యాచులు జరిగి దాదాపు 5 నెలలు అవుతుంది..తిరిగి మళ్ళీ ఎప్పుడు ఆటలు ప్రారంబిస్తారో తెలియని అనిశ్చితి నెలకొంది.
అయితే నిన్న ఈ ఏడాది జరగాల్సిన T 20 ప్రపంచకప్ వాయిదా పడుతుంది అంటూ వార్తలు వచ్చాయి అలాగే IPL కూడా నిర్వహించేది కష్టమే అంటూ వచ్చిన న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది..ఇదే కోవలో ధోని రిటైర్ అవ్వబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో వార్త తెగ హల్ చల్ చేసింది.అంతేకాకుండా #dhoniretire అనే హాష్ టాగ్ ట్రెండ్ అవ్వడం తో ఒక్కసారిగా ధోని అభిమానులు నిజమేనేమో అని తెగ కంగారు పడ్డారు.ఈ వార్తలు ధోని సతీమణి సాక్షి సింగ్ వరకు చేరడం తో ఇలాంటి రూమర్స్ కొట్టిపారేశారు.
ఈ సందర్బంగా ఒక ట్వీట్ కూడా పెట్టారు అదేంటంటే..‘అవన్నీ పుకార్లు. లాక్డౌన్ ప్రజలను పిచ్చోళ్లుగా మార్చిందని నేను అర్థం చేసుకున్నాను’ అంటూ ట్వీట్ చేశారు…పలు మార్లు ఇలాంటి పుకార్లకు చెక్ పెట్టె ప్రయత్నం చేసారు ధోని సతీమణి సాక్షి సింగ్ ..మళ్ళీ పదే పదే ఇలాంటి వార్తలు రావడం తో ఈ సారి కాస్త అసహనానికి గురయ్యారు.మరి ఏమైందో కాసేపటికే ఆ ట్వీట్ ని డిలీట్ చేసారు..కానీ అప్పటికే ఆ ట్వీట్ సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొట్టింది