ప్రపంచ కప్ లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ లలోనూ రోహిత్ సేన విజయాలను నమోదు చేసింది. ఇప్పటికే సెమీస్ లో అడుగు పెట్టిన టీం టేబుల్ టాప్ లో కూడా కొనసాగుతుంది. అయితే భారత్ టీం వరుస విజయాలు వెనక ఉన్న రహస్యం ఏంటి అని ఆలోచిస్తున్న వారికి సమాధానం దొరికింది. భారత్ విజయాల వెనుక డ్రెస్సింగ్ రూమ్ కీలకపాత్ర పోషిస్తుంది అంట.
అవును భారత్ టీంలో జరుగుతున్న కీలక మార్పులు వెనక డ్రెస్సింగ్ రూమ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఆసియా కప్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ నుండి ఈ మార్పు కనిపిస్తుంది. మ్యాచ్ అయిన వెంటనే టీం మొత్తాన్ని డ్రెస్సింగ్ రూమ్ లో సమావేశపరుస్తున్నారు. ఆ మ్యాచ్ లో చేసిన పొరపాట్లను విశ్లేషిస్తున్నారు. ఫీల్డింగ్ లో, బౌలింగ్ లో, బ్యాటింగ్ లో జరిగిన మంచి చెడులను ప్లేయర్స్ కి వివరిస్తున్నారు. అలాగే కొత్త కొత్త వ్యూహాలను డ్రెస్సింగ్ రూమ్ కేంద్రంగా రచిస్తున్నారు.
దీనికోసం కోచ్ రాహుల్ ద్రావిడ్ ఫీలింగ్ కోచ్ దిలీప్ కుమార్ ని ఎంచుకున్నారు. ఆయన మ్యాచ్ జరిగిన అంతసేపు బౌండరీ లైన్ వద్ద ఉంటున్నారు. మ్యాచ్ జరిగేటప్పుడు ఆటగాళ్ల తీరును పరిశీలిస్తున్నారు. మన ధర్మసాల వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ అనంతరం టీం ని డ్రెస్సింగ్ రూమ్ లో సమావేశపరిచి ఫీల్డింగ్ విభాగంలో బాగా రాణించిన వారిని అభినందించారు. భారత్ డ్రెస్సింగ్ రూమ్ లో జరిగే చర్చలు ఆటగాళ్ల ఆట తీరులో కనబడుతుంది అంటూ ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ప్రసంసించారు. భారత్ ఆటగాళ్ల మధ్య ఉన్న ఐకమత్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు.
డ్రెస్సింగ్ రూమ్ లో “యువర్ ది బెస్ట్ క్రికెట్ ఇస్ మై ఫస్ట్ లవ్” అన్న కొటేషన్లతో ఆటగాళ్లను మోటివేట్ చేస్తున్నారు. రాహుల్ ద్రావిడ్ లాంటి అనుభవం ఉన్న కోచ్ టీమిండియా కి ఎంతగానో కలిసి వస్తుంది. ఆయన వ్యూహాలు రచించడం ఆయన అనుభవం టీం కి ఉపయోగపడుతుంది. అలాగే ఆటగాళ్లకి మానసిక, శరీరక విశ్రాంతి అవసరం అంటూ టీం మేనేజ్మెంట్ తో కలిసి పూర్తి స్వేచ్చ ఇస్తున్నారు.దాని ప్రతిఫలం ఆటగాళ్ల ఆటతీరులో కనిపిస్తుంది.
Also Read:“బాబర్ ఆజాం” లాగా కోహ్లీ ఆడటం ఏంటి.? ఆ పిచ్ ని చూసే ఈ మాట అన్నారా.?