“బాబర్ ఆజాం” లాగా కోహ్లీ ఆడటం ఏంటి.? ఆ పిచ్ ని చూసే ఈ మాట అన్నారా.?

“బాబర్ ఆజాం” లాగా కోహ్లీ ఆడటం ఏంటి.? ఆ పిచ్ ని చూసే ఈ మాట అన్నారా.?

by Mounika Singaluri

Ads

కింగ్ విరాట్ కోహ్లీ నిన్న కలకత్తా వేదికగా జరిగిన మ్యాచ్ లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ , శుభ్ మాన్ గిల్ లు మంచి పార్టనర్ షిప్ ను నమోదు చేశారు. అయితే రోహిత్ శర్మ అవుట్ అవ్వడంతో తర్వాత కోహ్లీ క్రీజ్ లోకి వచ్చాడు. తర్వాత కొద్దిసేపటికి గిల్ కూడా అవుట్ అయ్యాడు.

Video Advertisement

ఒక దశలో ఇండియా కష్టాలు ఎదుర్కుంది. ఒకవైపు పిచ్ బ్యాటింగ్ కి ఏమాత్రం సహకరించ లేదు. కోహ్లీకి తోడు శ్రేయసయ్యర్ క్రీజ్ లో ఉన్నాడు. అలా ఇద్దరు కలిసి నెమ్మదిగా పార్టనర్ షిప్ నమోదు చేస్తూ ఇండియా స్కోర్ ని పెంచసాగారు. తర్వాత కోహ్లీ, అయ్యర్ ఇద్దరూ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అక్కడి నుండి అయ్యర్ దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు.

ఒక దశలో ఇద్దరు కలిసి స్కోర్ ని 300 దాటిస్తారేమో అనిపించింది. అయ్యార్ అవుట్ అవ్వడం తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ కూడా వెంటనే వెనుతిరిగాడు. సూర్య కుమార్ యాదవ్ కొంతసేపు కోహ్లీకి మంచి సహకారం అందించాడు. అతను కూడా అవుట్ అవ్వడంతో ఆల్ రౌండర్ జడేజా క్రీజ్ లోకి వచ్చాడు. ఇద్దరు కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.అయితే నిన్న కోహ్లీ పుట్టినరోజు కావడంతో అభిమానులు అందరూ అతను 49వ సెంచరీ చేయాలని బలంగా వేడుకున్నారు.

పిచ్ ఏమాత్రం సహకరించకపోవడంతో ముందు నుంచి నిదానంగా ఆడిన కోహ్లీ 43వ ఓవర్ లో ఉండగా 102 బాల్ కి 78 రన్స్ చేశాడు. అక్కడి నుండి సెంచరీ అయ్యేంతవరకు కూడా నిదానంగానే ఆడాడు. కోహ్లీ సెంచరీ చేయడంతో 100 కోట్లు భారతీయులు సంబరాలు జరుపుకున్నారు.అయితే కొందరు మాత్రం కోహ్లీకి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. ఇంటర్నెట్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. కోహ్లీ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నాడు అంటూ విమర్శించారు.

rohit-sharma

పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ బాబర్ ఆజాంలా కోహ్లీ ఆడుతున్నారంటూ మరికొందరు కామెంట్లు చేశారు.
కోహ్లీ సెంచరీ కోసం ఆడకపోతే ఇండియా స్కోర్ 350 దాటేదని మరొకరు కామెంట్ పెట్టారు. కొంతమంది అయితే అసలు కోహ్లీని ఎందుకు విమర్శిస్తున్నారు అంటూ సపోర్ట్ చేశారు.కెప్టెన్ రోహిత్ శర్మ నే చెప్పాడు కదా ఇటువంటి పిచ్ లో ఆడాలంటే కోహ్లీ లాంటి బ్యాట్స్ మెన్ క్రీజ్ లో ఉండాలని అంటూ మరికొందరు అంటున్నారు.ఏది ఏమైనా సరే కోహ్లీ సెంచరీ మాత్రం ఒక చరిత్ర సృష్టించింది.

Also Read:భర్త సడన్ ఎంట్రీ…కూలర్ లో ప్రియుడిని దాచిన భార్య..చివరికి ఏమైందంటే.?


End of Article

You may also like