కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం విజృంభించడం..క్రికెట్ ఆటకు ఈ సెగ తాకటంతో ఒక్కసారి క్రికెట్ మ్యాచ్లు అన్ని ఆగిపోయాయి. మరో వైపు ఐపీల్ కూడా అర్ధాంతరంగా నిలిచిపోవటం. అభిమానులని ఒకింత నిరాశకు గురి చేసింది.మరో వైపు భారత్ న్యూజిలాండ్ ల మధ్య జరగాల్సిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ కూడా వాయిదా పడుతుందా ? లేదా రద్దవుతుందా?
అనే అనేక అనుమానాలు నెలకొన్న వేళా ఐసీసీ ఇవాళ ఆయా అనుమానాలు అన్నింటికీ సమాధానం ఇస్తూ ‘ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఇంగ్లాండ్ లోనే ఉంటుంది అని క్లారిటీ ఇచ్చింది అంతే కాదు పరిమిత సంఖ్యలో అభిమానులని అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపింది.ఇంగ్లాండ్ లో ఒకింత కరోనా ప్రభావం తగ్గుతూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకునన్టు కూడా చెప్పింది.