వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ హీరోలుగా రాబోతున్న ఎఫ్3 సినిమా ఈ నెల 27వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంలో ఫస్ట్ రివ్యూ ఆల్రెడీ బయటకు వచ్చేసింది. అందులో ఏముందో ఓ సారి చూద్దాం..?
గతంలో ఎఫ్2 సినిమా వచ్చి ప్రేక్షకులను ఎంతగానో నవ్వించడమే కాకుండా సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దీనికి సీక్వెల్ F3 మూవీ కూడా రెడీ అయింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవి కోసం అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రంలో రాబోయే సన్నివేషాలు కామెడీ గురించి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. సినిమాలో మనం ఊహించిన దానికంటే ఎక్కువ కామెడీ సన్నివేశాలు ఉన్నాయని, ఇది చూసిన ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారని అంటున్నారు.
అయితే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ ఇటు కొడుతుందని టాక్ వచ్చింది. ఈ మూవీలో వెంకటేష్ సినిమా మొత్తం తన భుజాలపై మోస్తారని, హీరో వరుణ్ తేజ్ పర్ఫామెన్స్ కామెడీ టైమింగ్ కూడా బాగున్నాయని తెలుస్తోంది. సినిమా పాటలతో పాటుగా చిత్రీకరణ కూడా బాగుందని, బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టడమే కాకుండా భారీ కలెక్షన్స్ వసూలు చేస్తుందని, మూవీ ఫస్ట్ రివ్యూ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫ్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగిందని తెలుస్తోంది.
ఈ మూవీ నిర్మాత దిల్ రాజు ఆయన కూడా డిస్ట్రిబ్యూటర్ కాబట్టి కొన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేస్తున్నారట. ఇందులో కామెడీ సన్నివేశాలకు తోడుగా తమన్నా, మెహరీన్ అందాలు మరింత అట్రాక్టివ్ గా మారుతాయని తెలుస్తోంది. అయితే ఈ మూవీ ప్రేక్షకులకు చాలా కనెక్ట్ అవుతుందని అనిల్ రాయపూడి బలంగా నమ్ముతున్నారు. ఇది మాత్రం హిట్టయితే దీనికి సీక్వెల్ గా మరో f4మూవీ కూడా ఉంటుందని హింట్ ఇస్తున్నారు.
#F3Movie BLOCKBUSTER 💥💥🔥🔥@VenkyMama's One Man Show 💪🏻 @IAmVarunTej's Performance and Comedy Timing Excellent 👌🏻
Songs, video wise, are a Feast 👌🏻Box-office wise Expectation: 90 Cr+ (Closing Worldwide Share)
— Uttarandhra BO (@uttarandhrabo) May 25, 2022