సినిమా అంటే ఒక అబద్ధం. ఎందుకంటే అది నిజ జీవితం నుంచి తీసుకున్న కూడా దానికి సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కాస్త మసాలా జోడించి ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తూ ఉంటారు. ఎంత రియలిస్టిక్ గా తీసిన కూడా అందులో ఎంతో కొంత కల్పన ఉంటుంది. అందుకే మన నిజ జీవితంలో ఎవరైనా సరే ఒరేయ్ ఇది సినిమా కాదురా అని అంటూ ఉంటారు. ఎందుకంటే సినిమాలో కుదిరినట్టుగా బయట మనకి కుదరదు.
కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరిస్తే మరి కొన్ని సినిమాలు ప్రేక్షకులను పూల్స్ ని చేస్తాయి.
సినిమాలో మనల్ని ఇన్వాల్వ్ చేసి ముందు నుంచి జరుగుతుందంతా నిజం అని నమ్మించి తర్వాత అదంతా అబద్ధం అని అంటారు. అప్పటివరకు కన్నా అర్పకుండా చూసిన ప్రేక్షకుడు ఏంటి ఇది నిజం కాదా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అలాంటి సినిమాలు లిస్ట్ మీ ముందుకు తీసుకు వచ్చాం…
1. లియో:
తమిళ హీరో విజయ్ నటించిన లియో సినిమా తాజాగా విడుదలైంది. తెలుగులో మంచి టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమాలో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా నిజం కాదు అని ఒక రూమర్ వినిపిస్తుంది. అసలు విషయం దాచిపెట్టినట్లుగా చెబుతున్నారు.
2. పిజ్జా:
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన పిజ్జా చిత్రం 2012లో వచ్చింది. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను పూల్స్ చేసింది. అప్పటివరకు జరిగిందంతా అబద్ధం అని చెప్పేసరికి ఆడియన్స్ విస్మయానికి గురి అయ్యారు.
3.1-నేనొక్కడినే:
మహేష్ బాబు నటించిన 1- నేనొక్కడినే చిత్రం కూడా ఈ కోవ కే చెందుతుంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో మహేష్ బాబు తల్లిదండ్రులను చంపిన క్యారెక్టర్ గురించి అబద్ధం చెప్పి నమ్మిస్తారు. క్లైమాక్స్ లో నిజం రివీల్ చేస్తారు.
4. డార్లింగ్:
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం డార్లింగ్. ఈ చిత్రం ఫస్ట్ ఆఫ్ ఆడియన్స్ అందరికీ విపరీతంగా నచ్చేసింది. తీర ఇంటర్వెల్ అయ్యి సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ లో జరిగిందంతా అబద్ధమని హీరో చెప్పేసరికి అందరూ షాక్ తిన్నారు.
5. ఎవరు:
విలక్షణ నటుడు అడివి శేష్ చేసిన ఎవరు చిత్రం మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా హిట్టు కొట్టింది. అయితే ఈ సినిమాలో అడవిశేష్ ఫ్లాష్ బ్యాక్ నీ వేరే అతనిదిగా చూపించి ఆడియన్స్ ని ఫూల్స్ ని చేశారు.
6. ఖిలాడి:
మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడి చిత్రం కూడా ఆడియన్స్ ని తికమక పెట్టిందే. ఈ సినిమాల్లో జైల్ లో ఉండి రవితేజ చెప్పే కథంతా కూడా ఫేక్ అని తర్వాత తెలుస్తుంది.
7. పేట:
రజనీకాంత్ నటించిన పేట చిత్రం కూడా ఇదే లిస్టులో ఉంది. ఈ సినిమాలో విలన్ గా నటించిన విజయ్ సేతుపతికి రజనీకాంత్ చెప్పే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంత బూటకమే. పాపం విజయ్ సేతుపతి తో పాటు ఆడియన్స్ కూడా ఇది నమ్మేశారు.
Also Read:రీ-రిలీజ్ లలో కొత్త ట్రెండ్ మొదలు పెట్టిన అల్లు అరవింద్..! ఇంతకీ అదేంటో తెలుసా..?