రీ-రిలీజ్ లలో కొత్త ట్రెండ్ మొదలు పెట్టిన అల్లు అరవింద్..! ఇంతకీ అదేంటో తెలుసా..?

రీ-రిలీజ్ లలో కొత్త ట్రెండ్ మొదలు పెట్టిన అల్లు అరవింద్..! ఇంతకీ అదేంటో తెలుసా..?

by Mounika Singaluri

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతుంది. తమ అభిమాన హీరోల పాత సినిమాలను అభిమానులు రీ రిలీజ్ చేసి హంగామా సృష్టిస్తున్నారు. అలాగా రీ రిలీజ్ చేసిన సినిమాలు భారీ కలెక్షన్ లు సాధించి సినిమా అభిమానులను సినీ రంగ ప్రముఖులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ జల్సా, ఖుషి, తొలిప్రేమ సినిమాలో ఒక ట్రెండే సృష్టించాయి.

Video Advertisement

ఇలాగ ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రవితేజ, చిరంజీవి వంటి బడా హీరోల సినిమాలు కూడా రీ రిలీజ్ చేస్తున్నారు.అయితే ఇప్పుడు ఈ రీ రిలీజ్ ట్రెండ్ ఓటీటీ లో కూడా మొదలైంది. తెలుగువారి కోసం స్థాపించిన ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఇప్పుడు ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టం ఉంది. అల్లు అరవింద్ నేతృత్వంలో కొనసాగుతున్న ఆహా పలు షోలు తోటి, కొత్త కొత్త సినిమాలు తోటి తెలుగు వారందరినీ బాగా ఆకట్టుకుంటుంది.

అయితే ఇప్పుడు ఈ ఆహా యాప్ లో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు, రామ్ చరణ్ నటించిన మగధీర, మహేష్ బాబు నటించిన అతడు సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. అయితే ఈ మూడు సినిమాలు కూడా ఆల్ టైం తెలుగు ఫేవరెట్ సినిమాలు లిస్టులో ఉంటాయి.ముందుగా నవంబర్ 3వ తారీఖున మగధీర సినిమా ప్రీమియం క్వాలిటీతో ఆహా లో రీ రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 10వ తారీఖున మహేష్ బాబు అతడు సినిమా ప్రసారం కానుంది.

అలాగే అల్లు అరవింద్ నిర్మాణంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ మూవీ ఘరానా మొగుడు నవంబర్ 17వ తారీఖున ఆహా లో ప్రసారం కానుంది. ఈ మూడు సినిమాల రిలీజ్ ల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అల్లు అరవింద్ తెలివితేటలకు ఇండస్ట్రీ జనం అందరూ కూడా సర్ప్రైజ్ అవుతున్నారు. ఎప్పుడు ఆహా లో ఏదో ఒక కొత్త కంటెంట్ ని తీసుకువస్తూ ఆహ ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి అల్లు అరవింద్ చేసే కృషికి మెచ్చుకోకుండా ఉండలేం

Also Read:ఇంగ్లాండ్ తో మ్యాచ్ కి ముందు టీం ఇండియాకి పెద్ద షాక్…రోహిత్ స్థానంలో ఎవరు.?


End of Article

You may also like