భారత్ క్రికెట్ లో ఎంఎస్ ధోని పాత్ర ఎంతో కీలకమైనది. కెప్టెన్ గా, బ్యాటర్ గా, వికెట్ కీపర్ గా తనదైన ముద్ర వేశాడు ధోని. అయితే ధోని మ్యాచ్ లు ఫినిషింగ్ కి పెట్టింది పేరు. కీలకమైన మ్యాచ్ లలో ధోని క్రీజ్ లో ఉంటే తనదైన మార్కుతో మ్యాచ్ ఫినిష్ చేసి ఇండియాని ఒంటి చేత్తో గెలిపించేవాడు. ఆఖరి నిమిషంలో ఒత్తిడి అనేది లేకుండా చాలా ప్రశాంతంగా ఆడేవాడు కెప్టెన్ కూల్. ధోని రిటైర్ అయ్యాక ఇండియన్ టీం కి మంచి ఫినిషర్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడింది.
అయితే అప్పటినుండి మంచి ఫినిషర్ కోసం వేటలో పడ్డ ఇండియన్ టీం మేనేజ్మెంట్ కి మంచి ఆప్షన్ దొరికేసింది. ఇండియాకి ఎంతో మంచి ప్లేయర్లను అందించిన ఐపీఎల్ ద్వారానే ఆ ప్లేయర్ కూడా కూడా ఇండియన్ టీం కి దొరికాడు.
ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో కాదు రింకు సింగ్… ఈ పేరు ఇప్పుడు ఇండియాలో మారుమోగిపోతుంది. ఆస్ట్రేలియా ఇండియా ప్రస్తుతం ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడుతున్నాయి. నవంబర్ 23వ తారీఖున వైజాగ్ లో ఫస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత బ్యాటింగ్ దిగిన ఇండియన్ టీం ఒక దశలో బాగానే ఆడింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లు మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమ్ ని విజయతీరాలు వైపు నడిపించారు.
అయితే చివరికి వచ్చేసరికి హై టెన్షన్ డ్రామా నడిచింది. ఆరు బంతుల్లో ఏడు పరుగులు కావాల్సి ఉంది. ఆ ఓవర్ లో ఏకంగా మూడు వికెట్లు పడిపోయాయి. చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ దశలో ఆస్ట్రేలియా బౌలర్ వేసిన నోబాల్ ను క్రీజ్ లో ఉన్న రింకు సింగ్ సిక్స్ గా మలిచాడు. జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో రింకు 14 బంతులు ఆడు 22 పరుగులు చేశాడు. రింకు చేసిన ఫినిషింగ్ చూసి అభిమానులు అందరూ ఇండియాకి మరో ధోని దొరికేసాడు అంటూ సంబరపడుతున్నారు.
Also Read:ఇదేందయ్యా ఇది…ఫైనల్ లో ఇండియా ఓడిపోయాక అంత మాట అన్నారు…ఇప్పుడు ఇలా ట్విస్ట్ ఇచ్చారు ఏంటి ఫాన్స్.?