Ads
2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఘోర ఓటమి చెందిన తర్వాత ఇండియా అభిమానులు ఎవరు కూడా మళ్లీ క్రికెట్ చూడమంటూ కామెంట్లు చేశారు. ఎన్నో అంచనాల నడుమ వరల్డ్ కప్ లోకి ఎంటర్ అయ్యి లీగ్ దశలో మంచి బాగా పెర్ఫామ్ చేసి సెమీఫైనల్ లో న్యూజిలాండ్ ఓడించి ఫైనల్ కి వెళ్లిన ఇండియా అక్కడ తుస్సు మనిపించింది. ఆ ఓటమి నుండి ఇంకా భారత ఆటగాళ్లు గాని భారతీయ అభిమానులు గాని తేరుకోలేదు.
Video Advertisement
తాజాగా ఇండియన్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా ఓటమి జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతున్నాయి అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చూస్తే ఓటమి ఇండియన్ అభిమానులను ఎంతగా బాధించిందో తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇక క్రికెట్ ని చూడము క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పోయింది అంటూ చాలామంది అభిమానులు కామెంట్లు కూడా చేశారు.
అయితే తాజాగా ఆస్ట్రేలియా ఇండియా నడుమ టి20 సిరీస్ ప్రారంభమైంది. ఫస్ట్ మ్యాచ్ నవంబర్ 23వ తారీకున వైజాగ్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ని జియో సినిమా ప్రసారం చేసింది. సరే వరల్డ్ కప్ మ్యాచ్ ఓడిపోయింది కదా ఈ మ్యాచ్ ఎవరు చూస్తారులే అని అందరూ అనుకున్నారు. తీరా మ్యాచ్ లైవ్ చూసిన వారి సంఖ్య చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ మ్యాచ్ ను జియో సినిమా యాప్ లో 10.9 కోట్ల మంది లైవ్ లో వీక్షించారు. ఇది చూసిన అందరూ కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
క్రికెట్ చూడము, మ్యాచ్ చూడమంటూ ఎన్నో కామెంట్లు చేశారు, తీరా మ్యాచ్ వచ్చేసరికి అందరూ మళ్లీ టీవీలకి, సెల్ ఫోన్ లకి అతుక్కు పోయారు అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ లో అయినా కూడా భారతీయులు దాన్ని నరనరాన్న ఇమిడించేసుకున్నారు. క్రికెట్ ని ఇండియా నుండి వేరు చేయడం ఎవరి తరం కాదు అని నిన్న మరోసారి నిరూపించారు. ఇండియా గెలిచిన ఓడిన సరే ఇండియా అభిమానుల మద్దతు ఎప్పుడు ఉంటుంది అని మరో సారి చాటి చెప్పారు.
End of Article