నాచురల్ స్టార్ నాని హీరోగా మనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన చిత్రం హాయ్ నాన్న.
ఈ సినిమా డిసెంబర్ 7వ తారీఖున విడుదల కానుంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రై, సాంగ్స్ వంటివి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా సమయమ, గాజుబొమ్మ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.
ఈ సినిమాలో నాని లుక్కు కూడా బాగా ఆకట్టుకుంది. హీరోయిన్ శృతిహాసన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఓడియమ్మ పాట అందర్నీ ఆకట్టుకుంది. ఇది ఇలా ఉండగా ప్రతి సినిమాని ముందుగానే చూసేసాను, నేను సెన్సార్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను అని చెప్పుకునే ఉమైర్ సంధు హాయ్ నాన్న సినిమాకి ముందుగానే రివ్యూ ఇచ్చేశాడు.
తన ట్విట్టర్ లో హాయ్ నాన్న సినిమా గురించి అతను పోస్ట్ చేశాడు. హాయ్ నాన్న ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలను దోచుకుంటుందని వాళ్ళని ఆద్యంతం ఎంటర్టైన్ చేసే విధంగా ఉందని చెప్పుకొచ్చాడు. నాని మృనాల్ ఠాకూర్ ల పెర్ఫార్మన్స్ కట్టిపడేస్తుందని చెప్పాడు. నాని ఈ సినిమాని తన భుజాలపై మోసాడని ఇక ఈ సినిమా చూశాక ఏడవకుండా ఎవ్వరూ ఉండలేరు అంటూ రాసుకు వచ్చాడు. అలాగే హాయ్ నాన్న సినిమాకి 3.5 రేటింగ్ ఇచ్చాడు.
అయితే ఇతను రివ్యూలు జెన్యూన్ గా ఉండవని ఫాన్స్ చెప్తారు. గతంలో ఫ్లాప్ సినిమాలు కూడా ఇతను పాజిటివ్ గా రివ్యూలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.అయితే నాని ఫాన్స్ మాత్రం హాయ్ నాన్న సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా కొన్ని రోజులపాటు గుర్తుండిపోతుంది అని నాని ఫ్యాన్స్ కి భరోసా కల్పించాడు. ఇది ఒక డిఫరెంట్ జోనర్ సినిమాగా చెప్పుకొచ్చాడు. రేపు హాయ్ నాన్న సినిమాకి సోలో రిలీజ్ దక్కడంతో మంచి ఓపెనింగ్ సాధించే అవకాశం ఉంది.
First Review #HiNanna ( #HiPapa ) : It is a heartwarming saga, aimed at families and it will keep the audience thoroughly entertained. #Nani & #MrunalThakur gave Terrific Performances. They stole the show all the way. Go for it ! Still crying after watching it.
3.5⭐️/5⭐️ pic.twitter.com/n1HjpTh0oa
— Umair Sandhu (@UmairSandu) December 5, 2023
Also Read:ఈ పవన్ కళ్యాణ్ సినిమా ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ చేసుంటే..అతని కెరీర్ వేరేలాగా ఉండేదా.?