Benefits and Uses of Folvite Tablet in Telugu: ఫోల్వైట్ టాబ్లెట్లను డాక్టర్స్ ఎక్కువగా గర్భిణులకు ఇస్తారు. రక్తహీనత సమస్యలతో బాధపడేవారికి ఈ మాత్రలు బాగా ఉపయోగ పడతాయి.
ఫోల్వైట్ టాబ్లెట్ల లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇది రక్తహీనత సమస్యను నివారిస్తుంది. ఫోలేట్ అనేది కొన్ని ఆహార పదార్థాలలో సహజంగా కనపడే విటమిన్ బి. శరీరానికి ఇది చాలా అవసరం.
Also Read: AZITHROMYCIN TABLET USES: అజిత్రోమైసిన్ ఎలా పని చేస్తుంది..?
ఎర్ర రక్త కణాలని ఏర్పరచడానికి ఇది అవసరం. ఈ టాబ్లెట్లు వివిధ రూపాల్లో మనకి అందుబాటులో ఉంటాయి తక్కువ ఫాలిక్ స్థాయిలకు చికిత్స చేయడానికి లేదా నివారించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఫోలేట్ లోపం వలన రక్తహీనత కలుగుతుంది అటువంటప్పుడు ఈ టాబ్లెట్లను ఉపయోగించడం వలన రక్తహీనత సమస్య నుండి బయటపడొచ్చు.
సరైన ఆహార పదార్థాలని తీసుకోకపోవడం, గర్భధారణ, మద్యపానం, కడుపు పేగు సమస్యలు, కాలేయ వ్యాధి, మూత్రపిండాలు డయాలసిస్ మొదలైన సమయాల్లో డాక్టర్ ఈ టాబ్లెట్లను ప్రిస్క్రైబ్ చేస్తారు. ఫోలేట్ అనేవి విటమిన్ బి9 యొక్క రకాలు. ఫోలేట్ లోపం కోసం ఈ మెడిసిన్ ని తీసుకు వచ్చారు. బీన్స్, పుట్టగొడుగులు, గుడ్డు పచ్చసొన, పచ్చని ఆకుకూరలు, పండ్లు, దుంపలు, బంగాళాదుంప, పాలు వంటి వాటిలో మనకి ఈ ఫోలేట్ ఉంటుంది.
అయితే ఈ మాత్రలు వేసుకుంటే ఆకలి, వికారం, నిద్రలేమి, నిరాశ, ఆందోళన వంటివి కలగొచ్చు. కానీ గర్భిణీలు కచ్చితంగా తీసుకోవాలి. చాలా మంది గర్భం దాల్చే ముందే దీన్ని తీసుకోవడం మొదలుపెడతారు.
Folvite Tablet uses ఈ ట్యాబ్లేట్ తో ఈ సమస్యలు దూరం:
- గర్భిణుల్లో రక్తహీనత
- పిల్లల్లో రక్తహీనత
- మెగాలోబ్లాస్టిక్ రక్తహీనతలు
- ఫోలేట్ లోపం
- పౌషికాహార లోపం
What are the side effects of Folvite Tablet?: ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..?
- అలెర్జీ ప్రతిచర్యలు
- అనోరెక్సియా
- చేదు లేదా చెడు రుచి
- చిరాకు
- ఓవర్ యాక్టివ్
- ఎక్సైట్మెంట్
- గందరగోళం
- విటమిన్ బి12 సీరం స్థాయిలు
- వికారం
- కడుపు ఉబ్బటం
- వాంతులు
Find out the Benefits and Uses of Folvite Tablet in Pregnancy ఎందుకు దీన్ని ఉపయోగించాలి..?
- మెగాబ్లాస్టిక్ ఎనీమియా సమస్య కనుక ఉంటే అప్పుడు ఫోల్వైట్ టాబ్లెట్లను డాక్టర్లు ఉపయోగించమని చెబుతారు. అప్పుడు వీటి ద్వారా సమస్య నుండి బయట పడచ్చు.
- శరీరంలో ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే పుండ్లు వస్తాయి, శ్లేష్మం ఏర్పడుతుంది. వీక్నెస్ కూడా వస్తుంది. నిద్రలేమి వంటివి కూడా కలుగుతాయి. వీటి నివారణ కోసం ఫోల్వైట్ టాబ్లెట్లను డాక్టర్లు ఇస్తారు.
- గర్భిణీ స్త్రీలల్లో ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నట్టయితే వాళ్లకి పుట్టే బిడ్డల్లో కూడా లోపాలు వచ్చే ప్రమాదం ఉంది. కనుక ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు.