Home Health Adda Folvite Tablet: Uses, Benefits in Telugu గర్భిణీలు వాడే ఫోల్వైట్ వలన ఉపయోగం ఏమిటి..?

Folvite Tablet: Uses, Benefits in Telugu గర్భిణీలు వాడే ఫోల్వైట్ వలన ఉపయోగం ఏమిటి..?

by Megha Varna

Benefits and Uses of Folvite Tablet in Telugu:  ఫోల్వైట్ టాబ్లెట్లను డాక్టర్స్ ఎక్కువగా గర్భిణులకు ఇస్తారు. రక్తహీనత సమస్యలతో బాధపడేవారికి ఈ మాత్రలు బాగా ఉపయోగ పడతాయి.

ఫోల్వైట్ టాబ్లెట్ల లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇది రక్తహీనత సమస్యను నివారిస్తుంది. ఫోలేట్ అనేది కొన్ని ఆహార పదార్థాలలో సహజంగా కనపడే విటమిన్ బి. శరీరానికి ఇది చాలా అవసరం.

Also Read: AZITHROMYCIN TABLET USES: అజిత్రోమైసిన్ ఎలా పని చేస్తుంది..? 

Folvite Tablet uses in Telugu

ఎర్ర రక్త కణాలని ఏర్పరచడానికి ఇది అవసరం. ఈ టాబ్లెట్లు వివిధ రూపాల్లో మనకి అందుబాటులో ఉంటాయి తక్కువ ఫాలిక్ స్థాయిలకు చికిత్స చేయడానికి లేదా నివారించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఫోలేట్ లోపం వలన రక్తహీనత కలుగుతుంది అటువంటప్పుడు ఈ టాబ్లెట్లను ఉపయోగించడం వలన రక్తహీనత సమస్య నుండి బయటపడొచ్చు.

a letter to pregnant wife..!!

సరైన ఆహార పదార్థాలని తీసుకోకపోవడం, గర్భధారణ, మద్యపానం, కడుపు పేగు సమస్యలు, కాలేయ వ్యాధి, మూత్రపిండాలు డయాలసిస్ మొదలైన సమయాల్లో డాక్టర్ ఈ టాబ్లెట్లను ప్రిస్క్రైబ్ చేస్తారు. ఫోలేట్ అనేవి విటమిన్ బి9 యొక్క రకాలు. ఫోలేట్ లోపం కోసం ఈ మెడిసిన్ ని తీసుకు వచ్చారు. బీన్స్, పుట్టగొడుగులు, గుడ్డు పచ్చసొన, పచ్చని ఆకుకూరలు, పండ్లు, దుంపలు, బంగాళాదుంప, పాలు వంటి వాటిలో మనకి ఈ ఫోలేట్ ఉంటుంది.

a letter to pregnant wife..!!

అయితే ఈ మాత్రలు వేసుకుంటే ఆకలి, వికారం, నిద్రలేమి, నిరాశ, ఆందోళన వంటివి కలగొచ్చు. కానీ గర్భిణీలు కచ్చితంగా తీసుకోవాలి. చాలా మంది గర్భం దాల్చే ముందే దీన్ని తీసుకోవడం మొదలుపెడతారు.

Folvite Tablet uses ఈ ట్యాబ్లేట్ తో ఈ సమస్యలు దూరం:

  • గర్భిణుల్లో రక్తహీనత
  • పిల్లల్లో రక్తహీనత
  • మెగాలోబ్లాస్టిక్ రక్తహీనతలు
  • ఫోలేట్ లోపం
  • పౌషికాహార లోపం

Folvite Tablet uses ఈ ట్యాబ్లేట్ తో ఈ సమస్యలు దూరం:

What are the side effects of Folvite Tablet?: ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..?

  • అలెర్జీ ప్రతిచర్యలు
  • అనోరెక్సియా
  • చేదు లేదా చెడు రుచి
  • చిరాకు
  • ఓవర్ యాక్టివ్
  • ఎక్సైట్మెంట్
  • గందరగోళం
  • విటమిన్ బి12 సీరం స్థాయిలు
  • వికారం
  • కడుపు ఉబ్బటం
  • వాంతులు
Folvite Tablet uses in Telugu

Folvite Tablet uses in Telugu

Find out the Benefits and Uses of Folvite Tablet in Pregnancy ఎందుకు దీన్ని ఉపయోగించాలి..?

  • మెగాబ్లాస్టిక్ ఎనీమియా సమస్య కనుక ఉంటే అప్పుడు ఫోల్వైట్ టాబ్లెట్లను డాక్టర్లు ఉపయోగించమని చెబుతారు. అప్పుడు వీటి ద్వారా సమస్య నుండి బయట పడచ్చు.
  • శరీరంలో ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే పుండ్లు వస్తాయి, శ్లేష్మం ఏర్పడుతుంది. వీక్నెస్ కూడా వస్తుంది. నిద్రలేమి వంటివి కూడా కలుగుతాయి. వీటి నివారణ కోసం ఫోల్వైట్ టాబ్లెట్లను డాక్టర్లు ఇస్తారు.
  • గర్భిణీ స్త్రీలల్లో ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నట్టయితే వాళ్లకి పుట్టే బిడ్డల్లో కూడా లోపాలు వచ్చే ప్రమాదం ఉంది. కనుక ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు.

 

You may also like