బాబ్రీ మసీద్ తరువాత పెద్ద వివాదాస్పదమైన చర్చగా మారింది జ్ఞానవాపి మసీద్ విషయం. ఇంతకీ అప్పట్లో ఇక్కడ మసీదు ఉండేదా..? మందిరము ఉండేదా..? అనే చర్చ వివాదాస్పద చర్చ నడుస్తుంది. అసలే అప్పటిలో ఏం జరిగింది. మసీదు నిర్మాణం కోసం ఆలయాన్ని ధ్వంసం చేశారా లేదా ఆలయం ధ్వంసమైన చోట మసీదు నిర్మించారా అనే అనేక అనుమానాలు వెల్లడవుతున్నాయి.
మసీదు ఉండేచోట అప్పటిలో కాశీ విశ్వనాథుని ఆలయం ఉండేదా అనేది పెద్ద చర్చగా మారింది. జ్ఞానవాసి మసీదుకు దాదాపు 100 ఏళ్ల పైన చరిత్ర ఉందని దానికి రుజువు కూడా ఉందని ఒక ఫోటోని ఆధారంగా చూపిస్తున్నారు. 1834లో బ్రిటిష్ అధికారి జేమ్స్ ప్రిన్సెప్ ఈ మసీదు ను సందర్శించినప్పుడు ఆయన గీసిన చిత్రం అని ఆధారంగా చూపిస్తున్నారు. ఫోటోని క్షుణ్ణంగా పరిశీలిస్తే హిందూ ఆలయాన్ని పోలి ఉన్నట్లు ఉన్నాయి. అప్పటి చిత్రకారుడు సకీ ముస్తాయిద్ ఖాన్ తన మసీర్ – ఎ – ఆలమ్ గిరి లో ఆలయ కూల్చివేత గురించి ప్రస్తావించారు. చక్రవర్తి ఆజ్ఞప్రకారం అప్పటిలో ఇక్కడ కాశీ విశ్వనాథుని ఆలయం కూల్చివేసిన ట్లు ఇందులో ఉందని చెప్పుకొచ్చారు.
జ్ఞాన మసీదు పశ్చిమ గోడ వెనక నంది, గణేశుడు, హనుమంతుడు శృంగార గౌరీ విగ్రహాలు ఉన్నాయి. సామాన్యంగా నంది విగ్రహం శివాలయం గర్భగుడిలో శివుడుకి అభిముఖంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న నంది విగ్రహం శివుని వైపు కాకుండా మసీదు వైపు చూసినట్లుగా ఉంటుంది. అంటే మసీదు ఉన్న స్థలంలోనే శివుని అసలు గర్భగుడి ఉండేదని పిటిషనర్లు వాదిస్తున్నారు. మీరు చెప్పే వాటికి చారిత్రక ఆధారాలు లేవని మీ వాదనను ఎవరూ నమ్మరు అని ముస్లిం సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చారిత్రక ఆధారాలు:
ప్రకారం 4 -5 శతాబ్దాల కాలంలో అప్పటిలో రాజు అయినా విక్రమాదిత్యుడు ఈ కాశీ విశ్వనాధుని ఆలయం నిర్మించాడు. ఆరవ శతాబ్దంలో మన దేశ పర్యటనకు వచ్చినా చైనా యాత్రికుడు హ్యూయెన్ త్యాంగ్ కూడా వారణాసి ఆలయం గురించి ప్రస్తావించాడు.
1194 లో మహమ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుత్బ్ ఉద్దీన్ ఐబక్ , కౌనక్ రాజుని ఓడించినందుకు ఈ ఆలయాని కూల్చివేసినట్లుగా చెబుతున్నారు. అక్బర్ హయాంలో మళ్లీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించారు. ఆయన కుమార్తె ముస్లిం కుటుంబానికి కోడలిగా వెళ్లడంతో, అప్పటితో బ్రాహ్మణులను ఆలయాన్ని బహిష్కరించారు. ఔరంగజేబు మొగల్ సింహాసనాన్ని సొంతం చేసుకున్నా తర్వాత 1669 లో ఆలయాన్ని కూల్చివేసి ఆ స్థానంలో మసీదు నిర్మింపచేశాడట.
ఔరంగజేబు హయాంలో చివరి దండయాత్ర జరిగినప్పుడు అక్కడి పూజారి శివునిపై భక్తితో శివలింగంతో పాటు ఆలయ బావిలో దూకేసాడు అని, ఇప్పుడు మసీదు బావిలో ఉన్న శివలింగం అదేనని వాదనలు వినిపిస్తున్నాయి. ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయకుండానే మసీదు నిర్మించడం వలన ఇక్కడి గోడలకు దేవతా ప్రతిమలు కనిపిస్తున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి.
P. V నరసింహారావు గారి హయాంలో 1991లో ప్రార్ధనా స్థలాల చట్టం తీసుకువచ్చారు. దాని ప్రకారం 1947 ఆగష్టు 15 మసీద్ లు, ఆలయాలు ఇతర ప్రార్థన స్థలాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలని చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఎలాంటి ఫలితం వెలువడుతుందో ఎదురుచూడాలి.