పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా… దర్శకుడు క్రిష్ కంబినేషన్ లో వస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి.ఫస్ట్ లుక్ లో పవన్ ని చూసి సంబరపడిపోతున్నారు ఫాన్స్. భారీ రెస్పాన్స్ వచ్చిన పవన్ కళ్యాణ్ లుక్ కి..ఒక రేంజ్ లో సినిమా ఉండబోతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు ఫాన్స్.ఇకపోతే సినిమా లో పవర్ స్టార్ బందిపోటు పాత్రలో కనిపించబోతున్నారు.పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా,మరో ఇంట్రస్టింగ్ రోల్ లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కనిపించబోతున్నారు.
ఆమె పాత్ర ఎలా రూపొందించారు ? ఎలా ఉండబోతుంది అని సర్వత్రాఉత్కంట నెలకొంది.మొఘల్ సామ్రాజ్యానికి చెందిన రాణి పాత్రలోజాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తుందని చెబుతున్నారు.అంతే కాదు సినిమాకే హై లైట్ గా నిలువబోతుంది అని కూడా టాక్.మరో పాత్ర లో కోట శ్రీనివాస్ నటిస్తున్నట్టు స్వయంగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు కూడా. ఖుషి సినిమా నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తుండగా కీరవాణి గారు మ్యూజిక్ ని అందిస్తున్నారు.ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోయిన సంగతి తెలిసిందే.సో ఫాన్స్ కొన్ని డేస్ ఆగండి !
also Read : ఏంటిది DSP గారు.? మూడు సార్లు మెసేజ్ వచ్చిందేమో అని ఫోన్ చెక్ చేసుకోవాల్సి వచ్చింది.?