ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు.
అలాగే రోహిణి, సత్య శ్రీ కూడా జబర్దస్త్ లో రెగ్యులర్ గా స్కిట్స్ లో కనిపిస్తూ ఉంటారు. గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనకు కొత్త నటి జబర్దస్త్ లో కనిపిస్తున్నారు. తనే వర్ష. వర్ష ఎక్కువగా హైపర్ ఆది టీం లో కనిపిస్తారు. అలాగే రాకింగ్ రాకేష్, వెంకీ మంకీస్ టీమ్స్ తో కలిసి నటిస్తున్నారు.
వర్ష అభిషేకం, ప్రేమ ఎంత మధురం, తూర్పు పడమర వంటి సీరియల్స్ లో ముఖ్య పాత్రలు పోషించారు. ప్రేమ ఎంత మధురం సీరియల్ లో మాన్సీ పాత్రతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. వర్ష నటించడం మాత్రమే కాకుండా టీవీ ఛానల్స్ లో జరిగే ఈవెంట్స్ లో కూడా పర్ఫార్మ్ చేస్తూ ఉంటారు.
జబర్దస్త్ షో ద్వారా వర్ష తన కామిక్ యాంగిల్ ని కూడా మన అందరికీ పరిచయం చేశారు. స్కిట్స్ లో తన పెర్ఫార్మెన్స్ తో జడ్జెస్ నుండి ఎన్నో సార్లు అప్రిసియేషన్ కూడా అందుకున్నారు వర్ష. అలా వర్ష సీరియల్స్ తో పాటు జబర్దస్త్ షో ద్వారా కూడా ప్రేక్షకులందరినీ అలరిస్తున్నారు.
Jabardasth Actress Varsha Images – photos, images, gallery, stills.