తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రజాధారణ పొందిన ప్రోగ్రాం ఏది అంటే ఇట్టే చెప్పేస్తారు ‘జబర్దస్త్’ అని ఎవరైనా. ప్రతి గురు, శుక్రవారాల్లో ప్రతి ఇంట్లో టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. అలంటి ప్రజాధారణ కలిగిన ప్రోగ్రాం క్రమంగా గాడి తప్పుతున్నట్టు అనిపిస్తుంది. మితిమీరిన పంచులు, డబల్ మీనింగ్ డైలాగ్స్ లతో విమర్శల పాలవుతున్నారు.
టీవీల్లో వచ్చే ప్రోగ్రాం కాబట్టి ఇంట్లో కుటుంబసమేతాగానే ఎక్కువగా చూస్తారు. మరి ఫ్యామిలీస్ చూస్తున్నప్పుడు కంటెంట్ ని నిర్వాహకులు చాల జాగ్రత్తగా డెలివరీ చెయ్యాల్సిఉంటుంది. కానీ నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు ఇదివరకే ఎందరో కామెడియన్స్ మీద నెటిజన్స్ విమ్మర్శలు గుప్పించారు. తాజాగా ఎక్సట్రా జబర్దస్త్ ప్రోమో నుంచి వచ్చిన మరో ఎపిసోడ్ లో ఏకంగా స్టేజి పైనే ముద్దులు పెట్టుకుంటూ స్కిట్స్ చేస్తున్నారు టీం మెంబెర్స్.
జబర్దస్త్ లో లేడీ గెటప్ లో మగవాళ్లే ఉంటారు. వారిపై చెయ్ వేసిన టచ్ చేసిన పెద్దగా పట్టించుకోము. ఇటీవలే లేడీ కమెడియన్స్ కూడా స్కిట్ చేయడం మొదలు పెట్టారు మరి వారికి కనీస మర్యాద ఇవ్వడం అవతలి వారి హక్కు. లేటెస్ట్ ఎపిసోడ్ లో కమెడియన్ రాకింగ్ రాకేష్ అందరూ చూస్తుండగానే ఓ లేడీ కమెడియన్ రోహిణి ముద్దులు పెట్టేసాడు.
ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇంట్లో పిల్లలు, ఆడవారు ముసలి వారు చూస్తున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతయినా ముఖ్యం కూడా. మరి అటువైపున్న జడ్జెస్ కూడా నవ్వుకుంటూ కనిపిస్తునంరే కానీ వారిని నివారించే ప్రయత్నం చేయడం లేదు. https://youtu.be/rn2nGCPBMA4?t=50
Also Read :
పోస్ట్ మార్టం ను రాత్రి సమయం లో ఎందుకు చేయరో తెలుసా..? అసలు కారణం ఇదే..!