ఎవరైనా అకస్మాత్తుగా చనిపోయినా.. అనుమానాస్పదం గా చనిపోయినా వారు చనిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవడం కోసం పోలీసులు పోస్టు మార్టాన్ని ఆశ్రయిస్తారు. అయితే.. పోస్ట్ మార్టం చేయడానికి ప్రత్యేకం గా వైద్యులు ఉంటారు.

postmartum 2

ఈ పోస్ట్ మార్టం కి సంబంధించి ఆసుపత్రులలో ఒక రూల్ ఉంటుందట. అదేంటంటే.. ఏ మృతదేహానికి అయినా పోస్ట్ మార్టం ను కేవలం డే టైం లో మాత్రమే చేస్తారట. రాత్రి సమయం లో ఎట్టి పరిస్థితుల లోను పోస్ట్ మార్టం నిర్వహించరు. దీనికి కారణం మృతదేహాలను చూసి భయపడటం కాదు. సైంటిఫిక్ గా మరొక కారణం గా ఉంటుందట.

postmartum 1

అదేంటంటే.. రాత్రి సమయం లో పోస్ట్ మార్టం చేయాలంటే కచ్చితం గా లైట్స్ ను వేసుకోవాలి. కానీ.. ఈ ఎల్ ఈ డి లైట్ లను ఉపయోగించి పోస్ట్ మార్టం చేయడం వలన దేహం లోని అవయవాల పైన కాంతి పడినపుడు వాటి రంగు మారుతుంది. అంటే ఎరుపు రంగు నుంచి ఆరెంజ్ రంగుకు మార్పు చెందుతూ ఉంటుందట. దీనివలన కేసు మిస్ లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పోస్ట్ మార్టం ను ఎప్పుడూ డే టైం లో మాత్రమే చేస్తారు.