మెగా బ్రదర్ ‘నాగ బాబు’ మళ్ళీ వార్తల్లో నిలిచారు ఇటీవలే మహాత్మ గాంధీ హంతకుడు నాధూరాం గాడ్సే మీద ట్వీట్స్ పెట్టి కొత్త వివాదానికి తెరలేపిన నాగ బాబు..మళ్ళీ ఈ సారి కొత్తగా ట్వీట్స్ పెట్టారు అందులో ఏముందంటే ‘కరెన్సీ నోట్ల మీద మహాత్మ గాంధీ బొమ్మ కి బదులుగా అంబెడ్కర్,పీవీ నరసింహ రావు,ఏపీజే అబ్దుల్ కలం,వాజపేయి వంటి వారి చిత్రాలను చూడాలని ఉంది అంటూ ట్వీట్ చేసారు…ఇకపోతే గత ట్వీట్స్ కి జనసేన పార్టీ కి,తన ట్వీట్స్ కి ఎలాంటి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు.
కొత్త ట్వీట్ లో ‘కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ.గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.
దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.అంటూ చెప్పుకొచ్చారు.మరి ఇప్పుడు చేసిన తాజా ట్వీట్స్ ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి..
Indian కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ.
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 22, 2020