- చిత్రం : కోస్టి
- నటీనటులు : కాజల్ అగర్వాల్, కె.ఎస్.రవికుమార్, యోగిబాబు.
- నిర్మాత : సీడ్ పిక్చర్స్
- దర్శకత్వం : కళ్యాణ్
- సంగీతం : సామ్ సిఎస్
- విడుదల తేదీ : మార్చ్ 22, 2023
స్టోరీ :
సినిమా ఆర్తి (కాజల్ అగర్వాల్) అనే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఒక రౌడీని ఆర్తి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఆర్తి కొన్ని ప్రమాదాల్లో ఇరుక్కుంటుంది. దానివల్ల ఆర్తి అనుకున్న పనిని చేయలేకపోవడం మాత్రమే కాకుండా ఇంకా కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదుర్కొంటుంది. అప్పుడు ఆర్తి ఏం చేసింది? చివరికి ఆ సమస్యల నుండి బయటపడిందా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
Khosty Movie Review రివ్యూ :
ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ మధ్యలో తన వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించి సినిమాలకి కొంత కాలం వరకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు కాజల్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
ఈ సినిమా తమిళ్ సినిమా అయినా కూడా తెలుగులో విడుదల చేశారు. అయితే కాజల్ సినిమా అంటే ప్రతి సారి ఎంతో కొంత సందడి అయితే ఉంటుంది. ఈ సారి మాత్రం అలా ఏమీ లేకుండా ఈ సినిమా విడుదల అయ్యింది. హారర్ కామెడీ అని జోనర్ ఉన్న సినిమాలని మనం చాలా చూశాం. ఇది కూడా అలాంటి సినిమానే. కథలో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు.
కామెడీ చేయాలని ప్రయత్నించినా కూడా అది కామెడీ లాగా ఎక్కడ అనిపించదు. ఈ సినిమాలో చాలా మంది పెద్ద నటీనటులు ఉన్నారు. కానీ ఎవరూ కూడా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడలేకపోయారు. స్క్రీన్ ప్లే చాలా బలహీనంగా ఉంది. ఎమోషన్స్ కూడా ప్రేక్షకులకి అస్సలు కనెక్ట్ అవ్వవు.
ప్లస్ పాయింట్స్ :
- కాజల్ అగర్వాల్
- చాలా మంది పాపులర్ నటీనటులు ఉండడం
మైనస్ పాయింట్స్:
- బలహీనమైన కథ
- ప్రేక్షకులకి అస్సలు కనెక్ట్ అవ్వని ఎమోషన్స్
రేటింగ్ :
2/5
ట్యాగ్ లైన్ :
సినిమా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా కాజల్ అగర్వాల్ కోసం చూడాలి అనుకునే వారికి కోస్టి సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
watch trailer :