మెగాస్టార్ చిరంజీవి అంటే రీల్ హీరో కాదు రియల్ హీరో అని చాలా సందర్భాల్లో నిరూపించుకున్నారు. చిరంజీవి దాన గుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాన కర్ణుడిగా చిరంజీవికి పేరు ఉంది. సినిమాలో చిరంజీవి చేసే డ్యాన్సులు ఫైట్ల కి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. చాలామంది మాస్ ఫాన్స్ చిరంజీవి ఫైట్లు చూసేందుకే సినిమాకి వస్తారంటే అతిశయోక్తి కాదు.
తనని నమ్మి థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులను అలరించడానికి చిరంజీవి ఒళ్ళు హూనం చేసుకునేలాగా డాన్సులు ఫైట్లు చేసే వారిని డైరెక్టర్ లు, ప్రొడ్యూసర్లు చాలా సందర్భాల్లో చెప్పారు.
అయితే చిరంజీవి సినిమాలోనే కాకుండా బయట కూడా హీరో అనిపించుకున్న సందర్భం ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది.

ఈ విషయాన్ని చిరంజీవి సరసన ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సుహాసిని బయటపెట్టారు. చిరంజీవితో వీడియో కాల్ మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.మనం చూస్తే కేజిఎఫ్ సినిమాలో ఒక సీను ఉంటుంది. హీరో పక్కన హీరోయిన్ కారులో వెళ్తుంటారు. ట్రాఫిక్ జామ్ అయిన చోట తల్లి తన బిడ్డను ఎత్తుకుని పడిపోయిన బ్రెడ్ ముక్క కోసం కంగారు పడుతూ ఉంటుంది.అయితే ఆ ట్రాఫిక్ లో ఆమెను ఎవరు పట్టించుకోరు…కార్ ఆపరు. అప్పుడు హీరో జస్ట్ గన్ తీసి బయట పెట్టేసరికి మొత్తం సైలెంట్ అయిపోతారు.ఎవరికి వారు పారిపోతారు.
BOSS 🗿did before Rocky pic.twitter.com/rGHEukI95i
— Ramazing Memes 🏹🚩 (@RRRamazing) November 22, 2023
ఇప్పుడు ఇలాంటి సీనే చిరంజీవి తన రియల్ లైఫ్ లో చేశారట. కేరళలో ఒక సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు చిరంజీవి సుహాసిని కార్లలో వెళ్తున్నారట. ముందు కారులో చిరు వెనకాల కారులో సుహాసిని ఉన్నారట. అయితే ఒకచోట సడన్ గా అల్లరి మూకలు సుహాసిని కార్ మీదకి బీరు బాటిల్ విసిరి అల్లరి చేశారట. వెంటనే చిరంజీవి బయటకు దిగి తన వద్ద ఉన్న లైసెన్స్ తుపాకీ చూపించి వాళ్ళని బెదిరించారట. ధైర్యంగా ముందుకెళ్లి వాళ్ళని అదుపు చేశారట. ఈ విషయాన్ని సుహాసిని చెబుతూ చిరంజీవి బయట కూడా రియల్ హీరో అంటూ పొగిడారు.ఇది విన్న చిరు ఫ్యాన్స్ ఆయన హీరో ఇజానికి ఫిదా అయిపోతున్నారు.
Also Read:41 ఏళ్ల “అల్లు అర్జున్” పక్కన హీరోయిన్ గా… 40 ఏళ్ల హీరోయిన్..! ఎవరంటే..?


అయితే ఆ దూడ పొదుగు ఉబ్బి ఉండటాన్ని ఒక మహిళ గమనించింది. ఈ విషయాన్ని వెంటనే సజేష్ కు చెప్పింది. అతను కూడా దాన్ని పరిశీలించి చూశారు. ఆ పోదుగు దగ్గర గట్టిగా ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఒక సమయంలో పాలను పితికి చూశారు. అందులో నుంచి పాలు ధారగా వచ్చాయి. పాలు బాగానే ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రతి రోజూ పాలు పిండడం మొదలుపెట్టాడు. పాలు కూడా చిక్కగా తాగడానికి అనువుగానే ఉన్నాయి.