దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ గాయకుల్లో కేకే కూడా ఒకరు. ఈయన ఒక్క హిందీలోనే కాకుండా తెలుగు తమిళం, కన్నడం,ఇంకా ఇతర భాషల్లో ఎన్నో పాటలు పాడాడు. పాడడం కాదు ఆ పాటలకు ప్రాణం పోశాడు.
ఈయన లాంటి సింగర్లు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు అని చెప్పవచ్చు. గత 20 సంవత్సరాలుగా సంగీతంతో ఉర్రూతలూగిస్తున్న కేకే ఒక్కసారిగా మరణించడం సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది.
ఆయన మరణానికి ఎంతో మంది ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అతని వ్యక్తిత్వం విషయానికి వస్తే ఏ పాట పాడిన నిబద్ధతతో పాడేవాడు. డబ్బులకు ఆశ పడే వ్యక్తి కాదు. కోట్ల రూపాయలు ఇచ్చిన ఒక దగ్గర పాడను అని చెప్పేసాడు. ఇక ఆయన ఒక పాటకు ఎంత పారితోషికం తీసుకుంటాడు. అనేది ఓ సారి చూద్దాం..?
కేకే అసలు పేరు కృష్ణ కుమార్ కున్నాథ్.. కోల్కతాకు చెందిన గాయకుడు. ఆయన తెలుగు, మలయాళం, బెంగాలీ, తమిళం, మరాఠీ , వంటి భిన్నమైన భాషలలో కూడా తన గొంతును ఆలపించారు. వందలాది పాటలు పాడి ఎంతోమందిని ఆకట్టుకున్నారు కేకే. కోల్కత్తాలో మంగళవారం రోజున ఒక ఈవెంట్ లో పాటలు పాడుతూ ఉండగా హఠాత్తుగా అస్వస్థత గురయ్యారు. పాడటంలో చాలా ఇబ్బందిగా ఉందని తెలిసిన వెంటనే కేకేను తను ఉండే హోటల్ గదికి తీసుకెళ్లారు. అక్కడున్న మేనేజ్మెంట్ తో నా ఆరోగ్యం బాగోలేదు అని చెప్పడంతోనే వెంటనే ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ కి వెళ్లే వరకు కేకే కొంత వరకు బాగానే ఉన్నాడు. వైద్యుల వద్దకు చేరుకునే సమయంలోనే మృతి చెందారు. ఆయన మృతితో సంగీత ప్రపంచం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది.
ఆయన తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి లో “యే మే రాజహా.. అనే పాట ఇప్పటికి కూడా యువతలో జోష్ నింపుతుంది.. అలాగే ఆర్య 2 సినిమాలో ” గుప్పెడంత ఈ ప్రేమకి” అనే సాంగ్ ఆల్ టైం లవ్ సాంగ్స్ లో రికార్డు సృష్టించింది.
అయితే కేకేకు ఒక స్పెషాలిటీ ఉంది. ఆయన ఏదైనా పాట పాడే ముందు ట్యూన్ తనకు నచ్చితేనే పాడటానికి ఒప్పుకునే వారట. ఈ విధంగా నిబద్ధత కలిగిన సింగర్ గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ధనవంతులు నిర్వహించే పార్టీలలో కానీ వివాహ వేడుకల్లో కానీ పాటలు పాడాలని కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన పాడేవారు కాదట. ఆయన కేవలం ఫ్యాన్స్ నిర్వహించే ఈవెంట్స్ లో మాత్రమే పాటలు పాడు తానని ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారనీ తెలుస్తోంది. కేకే తనకు ట్యూన్ నచ్చితే మాత్రం తక్కువ రెమ్యునరేషన్ తీసుకొని కూడా పాట పాడేవారట . ఆయన ఒక్కో పాటకు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మధ్యలో తీసుకున్నారని సమాచారం.