ఆయన పాడిన పాటలు చాలా సినిమాల్లో సూపర్ హిట్ గా నిలిచాయి. పాటమ్మె తన ప్రాణం అనే కేకే చివరికి ఆ పాట పాడుతోనే ప్రాణం పోగొట్టుకున్నాడు.

Video Advertisement

ఈయన బాలీవుడ్ గాయకుడు. పూర్తి పేరు కృష్ణ కుమార్ కున్నాథ్.. మంగళవారం రోజున కోల్కత్తాలో మృతి చెందారు.

ఒక లైవ్ షో చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో కేకే ను పరిశీలించిన వైద్యులు రాత్రి 10.30 గంటలకే ప్రాణం పోయినట్లు తెలిపారు. ప్రస్తుతం కేకే వయసు 53 సంవత్సరాలు. ఆయన ఒక హిందీలోనే కాకుండా దక్షిణాది సినిమాల్లో దాదాపు 250 పైగా పాటలు పాడారు.

అలాగే హమ్ దిల్ దే చుకే సనం అనే మూవీ లో కూడా ఆయన పాట పాడారు. ఆయన కోల్కతాలోని వివేకానంద కాలేజీలో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ సింగర్ హాజరయ్యారు. ఈ విషయాన్ని కూడా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేశారు.

ప్రస్తుతం ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ, గాయకుడు అర్మాన్ మాలిక్, నటుడు అక్షయ్ కుమార్, మున్మున్ దత్త, నటి సోనాల్ చౌహాన్ లాంటి ప్రముఖులు సంతాపం తెలియజేశారు. కేకే మనమధ్య లేరంటే నమ్మలేకపోతున్నానని అర్మన్ అన్నారు.

https://youtu.be/k2QWiZBoD9o