కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కబళించి వేసింది ఈ దెబ్బతో ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి.అటు ప్రజల ఆరోగ్యాలతో పాటు ఇటు ఆర్థికంగా కూడా కష్టాల పాలు అయ్యాయి.కరోనా మహమ్మారి ప్రభావం సినీ ఇండస్ట్రీ పైన కూడా తీవ్రంగా చూపిస్తుంది.ఇటీవలే కొందరు ఆర్టిస్టుల జీవితాలు వీధుల పాలు అవ్వడం మనం చూసాము కూడా..ఇలాంటి సంఘటనే మరొకటి పునరావృతం అయినది.
కోలీవుడ్ కి చెందిన యువ దర్శకుడు బాల మిత్రన్ తీవ్ర అస్వస్థతకు గురియై మృతి చెందారు.అతి పిన్న వయస్కుడు అయిన బాల మిత్రన్ వయసు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే.ఈయన సూకీ మూర్తి దర్శకత్వ శాఖలో పని చేసాడు.బాల మిత్రన్ దర్శకత్వం వహించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా..లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటం తో అది కాస్త విడుదల ఆగిపోయాయి.ఆయనకు పక్షవాతం తీవ్రస్థాయిలో రావటంతో బంధువులు ఆసుపత్రిలో చేర్చారు సినిమాలు విడుదలకు నోచుకోకపోవడం,తో ఆర్థిక సమస్యలు,ఆరోగ్య సమస్యలు తో తీవ్ర ఇబ్బందులను ఎదురుకున్నారు .బాల మిత్రన్ మృతితో..తుదిశ్వాస మంగళవారం ఉదయం విడిచారు..ఆయన మృతి పట్ల పలువురు తమిళ దర్శకులు,నటీనటులు సంతాపం ప్రకటించారు తమిళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి.