కొరటాల శివ మన తెలుగు ఇండస్ట్రీ లోనే టాప్ టెన్ డైరెక్టర్లలో మంచి పేరున్న దర్శకుడు. ఈయన ఇంతవరకు తీసిన సినిమాల్లో అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మొదట కొరటాల శివ ప్రభాస్ తో మిర్చి మూవీ ద్వారా తన దర్శకత్వాన్ని మొదలుపెట్టారు. ఆయన చేసిన మొదటి సినిమానే బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించారు. దీని తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలకు డైరెక్షన్ వహించారు.
లేటెస్ట్ గా ఆచార్య మూవీతో మరో విజయం కోసం మన ముందుకు వచ్చారు కొరటాల శివ. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 29వ తేదీన థియేటర్ లోకి వచ్చింది. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజు నుంచే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ ను మూటగట్టుకుంది.
దీంతో కొరటాల శివ డైరెక్షన్ విషయంలో కొద్దిగా తడబడ్డారు అని, అంత పెద్ద స్టార్ హీరోలు ఉన్నా కానీ సినిమాను సరిగ్గా తీయలేక పోయారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో కొరటాల శివ బాధపడి తన పారితోషికం లో 50% ఆచార్య మూవీ డిస్ట్రిబ్యూటర్లకు అందించాలని నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి చివరికి ఈ మూవీ ఏ విధంగా మారుతుందో మనం వేచిచూడాల్సిందే.