“హానెస్ట్ గా చెబుతున్నా… నేను డైరెక్షన్ చేయలేదు”… కొరటాల శివ కామెంట్స్ వైరల్.!

“హానెస్ట్ గా చెబుతున్నా… నేను డైరెక్షన్ చేయలేదు”… కొరటాల శివ కామెంట్స్ వైరల్.!

by Sunku Sravan

Ads

సినీ ఇండస్ట్రీలో హిట్స్ ప్లాప్స్ అనేవి సర్వసాధారణం. ఒక్కోసారి ఒక్కో సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై చాలా హిట్ అవుతుంది. కానీ కొన్ని సమయాల్లో దారుణంగా ఫెయిల్ అవుతుంది. ఈ విధంగా పెద్ద పెద్ద సినిమాలలో ఏ మూవీ సక్సెస్ అయినా ఆ క్రెడిట్ మొత్తం దర్శకులకు వెళుతుంది. అయితే ఆచార్య మూవీకి నెగిటివ్ టాక్ రాగ దర్శకుడు కొరటాల శివను నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. చిరంజీవి మరియు రామ్ చరణ్ లాంటి టాలెంటెడ్ హీరోలు డేట్స్ ఇచ్చిన ఆ అవకాశాన్ని కొరటాల వాడుకో లేదని కామెంట్ చేశారు.

Video Advertisement

అయితే ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగానే శివ మాట్లాడుతూ ” హానెస్ట్ గా చెబుతున్నాను.. నేను దర్శకత్వం చేయలేదు ” అంటూ సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.చిరంజీవి ముందు కొరటాల శివ తానే స్వయంగా ఈ కామెంట్ చేయడం చాలా సెన్సేషనల్ అయింది. చిరంజీవి మరియు రామ్ చరణ్ సీన్లను చేసుకుంటూ వెళ్లారని దర్శకుడిగా నేను రిలాక్స్ అయ్యాను అంటూ కొరటాల శివ చెప్పుకున్నారు.

ఈ తరుణంలో చిరంజీవి మాత్రం కొరటాల శివ చెప్పింది నిజం కాదని, కొరటాలకు ఏం కావాలో అదే డెలివరీ చేశామని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్ ఇంట వైరల్ అవుతుంది. ఆయన ముందే చెప్పారు సినిమా రిజల్ట్ మనమే సినిమా అస్సాం ట్రైన్ ఎక్కింది అని అర్ధం చేసుకోలేకపోయాము అంటూ ట్రోల్ చేస్తున్నారు.

watch video:

ఆచార్య మూవీ రిజల్ట్ తర్వాత కొరటాల శివ మీడియా ముందుకు వచ్చి ఇప్పటివరకు చెప్పలేదు. ఈ సినిమా ఫలితంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఆచార్య సినిమా ఫెయిల్ అయినా ఎన్టీఆర్ సినిమా మాత్రం చాలా హిట్ అవుతుందని కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ గతంలో పలువురు ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశాన్ని ఇవ్వగా ఆ డైరెక్టర్లు ఎన్టీఆర్ తో చేసిన సినిమాలు చాలా విజయం సాధించాయి. ఈ మూవీ విషయంలో కూడా ఇదే ఫలితం రిపీట్ అవుతుందని తారక్ అభిమానులు భావిస్తున్నారు. కాకపోతే రాజమౌళి తో సినిమా చేసాక ఫ్లాప్ పడుతుంది అనే భయం తారక్ ఫాన్స్ ని కూడా వెంటాడుతుంది.


End of Article

You may also like