గతవారం బాక్స్ ఆఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి మెగా హీరో వైష్ణవ్ తేజ్,శ్రీ లీల జంటగా వచ్చిన ఆదికేశవ. ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నిర్మాత నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాణం భాగస్వామిగా ఉన్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
అలాగే మరో సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మించిన కోట బొమ్మాళి పిఎస్. ఇందులో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించగా, రాహుల్ విజయ్, శివాని జంటగా నటించారు. జోహార్ సినిమా దర్శకుడు తేజ ఈ సినిమాని డైరెక్ట్ చేయగా, బన్నీ వాసు నిర్మించారు. అయితే రెండు సినిమాల మీద పెద్దగా బజ్ లేదు కానీ ప్రమోషన్స్ లో ఆడియన్స్ ని బాగా ఆకర్షించాయి.
అయితే రిలీజ్ కి ముందు కోట బొమ్మాళి సినిమా పైన ఆది కేశవ సినిమా పై చేయి సాధిస్తుందని అందరు అనుకున్నారు.కానీ సినిమా రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అయింది.ఆదికేశవ సినిమా రొటీన్ సినిమాగా మిగిలిపోయింది. అయితే కోట బొమ్మాళి పిఎస్ సినిమా మలయాళ సినిమా నాయట్టు కి రీమేక్ అయినా కూడా తెలుగుకి తగ్గట్టు బాగా మార్పులు చేశారు.అలాగే ఈ సినిమా లో ఉన్న పొలిటికల్ కంటెంట్ కి జనాల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ఉండడంతో సరిగ్గా ఎలక్షన్ ఫీవర్ లో మేకర్స్ ఈ సినిమాని రిలీజ్ చేసి సక్సెస్ అయ్యారనే చెప్పాలి.అయితే మొదటి వారం కలెక్షన్స్ చూసుకుంటే ఆదికేశవ కంటే కూడా కోట బొమ్మాళి సినిమాకి శనివారం ఆదివారం కలెక్షన్స్ పెరిగాయి. కోట బొమ్మాళి సేఫ్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. మరోపక్క ఆదికేశవ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలిపోతుంది. ఫైనల్ గా చూస్తే ఈ వారం బాక్స్ ఆఫీస్ విన్నర్ కోట బొమ్మాళి పిఎస్ అని చెప్పొచ్చు.
Also Read:అంత మంచి నటుడికి…వైష్ణవ తేజ్ “ఆదికేశవ”లో ఇలాంటి పాత్ర ఇచ్చారు ఏంటి.?