తమిళ్ స్టార్ హీరోయిన్ త్రిష, నటుడు మన్సూర్ అలీ ఖాన్ వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఇవాళ ప్రెస్ మీట్ లో మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అయ్యాయి.

Video Advertisement

ఇటీవల లియో సినిమాలో తనకి త్రిషకి మధ్య కొన్ని సీన్స్ ఉంటే బాగుంటుంది అంటూ ఆ సీన్స్ గురించి వివరించిన విధానం మీద చాలా గొడవలు అయ్యాయి. త్రిష ఈ విషయంపై మాట్లాడుతూ, “మన్సూర్ అలీ ఖాన్ అలా మాట్లాడడం తప్పు” అని చెప్పారు.

mansoor ali khan reply to trisha comments

ఇదే విషయం మీద లియో డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ కూడా మాట్లాడుతూ, “మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడిన మాటలు చాలా తప్పు” అన్నారు. అంతే కాకుండా ఎంతో మంది నటులు, తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి నితిన్, మెగాస్టార్ చిరంజీవి వంటి వాళ్లు కూడా త్రిషకి మద్దతుగా మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాకుండా తమిళ సినిమా సంఘం అయిన నడిగర్ సంఘం మన్సూర్ అలీ ఖాన్ ని బ్యాన్ చేస్తూ తాత్కాలిక బ్యాన్ విధించింది.

mansoor ali khan reply to trisha comments

ఈ విషయం మీద ఇవాళ మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడారు. నడిగర్ సంఘం మన్సూర్ అలీ ఖాన్ ఈ విషయాన్ని అర్థం చేసుకొని క్షమాపణలు చెప్తేనే తనపై ఉన్న బ్యాన్ ఎత్తి వేస్తాము అని అన్నారు. దాంతో ఈ విషయంపై మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ క్షమాపణలు చెప్పేది లేదు అని అన్నారు. ఇండియా టుడే కథనం ప్రకారం ప్రెస్ మీట్ లో మన్సూర్ అలీ ఖాన్ ఈ విధంగా మాట్లాడారు.

mansoor ali khan reply to trisha comments

ఈ విషయంపై మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ, “నా మీద తాత్కాలిక నిషేధం విధించి నడిగర్ సంఘం తప్పు చేసింది. ఇలాంటి ఒక విషయం జరిగినప్పుడు నన్ను వివరణ కూడా అడగలేదు. నాకు ఫోన్ చేసి ఉండాల్సింది. లేకపోతే నా కామెంట్స్ గురించి వివరణ అడుగుతూ ఒక నోటీస్ అయినా విడుదల చేయాల్సింది. విచారణ జరగాలి. కానీ అది జరగలేదు. నడిగర్ సంఘం నా మీద చేసిన బ్యాన్ ని ఉపసంహరించుకోవడానికి నేను నాలుగు గంటల సమయం ఇస్తున్నాను. వాళ్లు నన్ను క్షమాపణలు అడగాలి.”

mansoor ali khan reply to trisha comments

“నేను ఒకళ్ళని క్షమాపణ అడిగే వాడిలాగా కనిపిస్తున్నానా? నేను ఎవరో ప్రజలకి తెలుసు. నాకు తమిళ ప్రజల మద్దతు ఉంది. త్రిష, నా ఫోటోలు వధూవరుల లాగా ఉన్నట్టు ఎడిట్ చేసి మీడియా ప్రచురించింది. నావి మంచి ఫోటోలు కూడా ఉన్నాయి. అవి ఉపయోగించుకోలేరా? కొన్ని ఫోటోల్లో నేను బానే కనిపిస్తాను. సినిమాల్లో సీన్ అంటే ఏంటి? నిజంగా చేస్తామా? సినిమాల్లో దాడి చేయడం అంటే ఏంటి? ఎవరినైనా నిజంగానే దాడి చేస్తామా? మీకు కాస్త కూడా తెలివి లేదా? నేనేమీ తప్పు మాట్లాడలేదు. నేను క్షమాపణలు చెప్పను” అని మన్సూర్ అలీ ఖాన్ ప్రెస్ మీట్ లో తెలిపారు.

watch video :

ALSO READ : ఈ ఫోటోలో ఉన్న అతను ఇప్పుడు దేశం మొత్తం గర్వించదగ్గ పెద్ద హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?