Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని మహేష్ బాబు కొనసాగిస్తున్నాడు. కృష్ణ రమేష్ బాబు, మహేష్ బాబులను బాలనటులుగా పరిచయం చేశారు. మహేష్ చిన్నప్పుడే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఆ తరువాత హీరోగా మారి తండ్రికి తగ్గ తనయుడుగా సూపర్ స్టార్ అయ్యాడు.
కృష్ణలానే మహేష్ బాబు కూడా కొడుకు గౌతమ్ ని ‘నేనొక్కడినే’ మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం చేశాడు. ఆ తరువాత గౌతమ్ మళ్లీ మూవీస్ లో నటించలేదు. మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో గౌతమ్, సితారలకు సంబంధించిన విషయాలను అభిమనులతో షేర్ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. నమ్రత ఇటీవల రమేష్ బాబు కూతురు భారతి గురించి పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఈ ఇద్దరమ్మాయిల వల్ల మా ఇంట్లో నవ్వులొచ్చాయి అని రాసుకొచ్చింది. భారతి, సితారలతో తీసుకున్న సెల్ఫీని కూడా షేర్ చేసారు. నమ్రత తాజాగా కొడుకు గౌతమ్ వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఈ వీడియో సూపర్ స్టార్ అభిమానులను ఖుషి చేస్తుంది. ఆ వీడియో ఏంటీ అనుకుంటున్నారా, అది గౌతమ్ ఫస్ట్ థియేటర్ ప్రొడక్షన్ వీడియో. ఎప్పుడూ సైలెంట్ గా కనిపించే గౌతమ్ గతంలో స్విమ్మింగ్లో రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. నమ్రతా షేర్ చేసిన గౌతమ్ స్విమ్మింగ్ వీడియో కూడా వైరల్ అయ్యింది. తాజాగా గౌతమ్ తన స్కూల్లో క్లాస్మెట్స్తో కలిసి స్కిట్ చేశాడు.తన మిత్రులతో కలిసి చక్కని హావా భావాలతో నటించాడు. దానిలో గౌతమ్ లుక్ కూడా డిఫరెంట్గా ఉంది. గౌతమ్ ఇంగ్లీష్ మాడ్యులేషన్ సూపర్ గా ఉంది. ఈ స్కిట్ లో గౌతమ్ని చూసి మహేష్ అభిమానులు, నెటిజన్లు, మహేష్ లానే ఉన్నాడని, ఫ్యూచర్ ప్రిన్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. నమ్రత్ షేర్ చేసిన గౌతమ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహేష్ అన్నయ్య రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ప్రస్తుతం అమెరికాలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గౌతమ్ తన స్టడిస్ పూర్తయిన తరువాత హీరోగా ఎంట్రీ ఇస్తాడని సమాచారం.