లాక్ డౌన్ మొదలై దాదాపు యాభై రోజులు కి పైగా అవుతున్నా కూడా కరోనా మహమ్మారిని ని నివారించ లేకుండా ఉన్నాము..దేశంలో దీని తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉంది..దేశం లో దీని సంఖ్య 1,51,769 చేరింది మరణాలు 4337 ఉన్నాయి.లాక్ డౌన్ లో అంచలు అంచలు గా సడలింపులు ఇస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వం.లాక్ డౌన్ 4 ఈ నెల 31 వ తేదీ తో ముగియనుంది.
ఇక లాక్ డౌన్ 5 కూడా ఉండబోతుంది అంటూ సంకేతాలు పంపుతున్నారు మరో రెండు వారాలు ఉండబోతుంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్ప్పటికే జూన్ నెల ఒకటవ తేదీ నుంచి రైల్వే శాఖ 200 రైళ్లు సర్వీసులు పునప్రారంబించ బోతుంది.ఇప్పటికే దేశీయ విమాన సర్వీసులు మొదలయ్యాయి.కర్ణాటక లో జూన్ 1 వ తేదీ నుంచి ఆలయాలు,అన్ని ప్రార్థన మందిరాలు తెరవబోతునన్టు ప్రకటించారు.దేశం లోని ప్రధాన నగరాలూ అయిన ముంబై, పూణె, జైపూర్, సూరత్, అహ్మదాబాద్, చెన్నై, కోల్కతా, థానే, ఇండోర్, లలో కరోనా తీవ్రత అధికంగా ఉన్నందున మరింత కఠినంగా లాక్ డౌన్ ను అమలు పరిచే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే మే 30 న ప్రధాని జాతిని ఉద్దేశించి మరో సారి మాట్లాడబోతునన్టు తెలుస్తోంది అదే రోజు ప్రధాని స్వయంగా ప్రకటించబోతున్నారు.