నేటి ప్రపంచంలో మనకు ఎలాంటి విషయం కావాలన్నా ప్రపంచం లో అసలేం జరుగుతుంది అని తెలుసుకోవాలన్నా ఒకటే సమాధానం అదే సోషల్ మీడియా…సోషల్ మీడియా అనేది మన నిత్య జీవితం లో ఒక భాగం గా మారిపోయింది.సమాజం లో మంచి చెడు ఉన్నట్టే..ఇక్కడ కూడా కొందరు మర్యాదగా ను..మరికొందరు ఆకతాయిగాను స్పందిస్తూ ఉంటారు.సామాన్యుల నుంచి సెలెబ్రెటీలవరకు ఈ ఆకతాయిల అల్లరి..ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది.
కొందరు వారికి బుద్ది చెప్పే ప్రయత్నం చేస్తే మరికొందరు మనకు ఎందుకులే అని వదిలేస్తారు.ఇలాంటి ఒక ఘటన టాలీవుడ్ హీరోయిన్ బీజేపీ లీడర్..మాధవి లత కి ఎదురైనది.సోషల్ మీడియా లో ఎప్పుడు అభిమానులతో టచ్ లో ఉండే ఈమె..ఇటీవలే ఆమె పెట్టిన ఒక పోస్ట్ కి ఆకతాయిలు…నెగటివ్ కామెంట్స్ చేస్తూ…మాధవి లత కి కోపం తెప్పించేలా చేశారు.
బ్రెయిన్ ట్యూమర్ తో బాధ పడుతున్న వ్యక్తికి సహాయం చేయమని తన ఫాలోయర్స్ ని కోరూతూ ఒక పోస్ట్ పెట్టారు..
పోస్ట్ కి ప్రతిస్పందిస్తూ కొందరు ఆకతాయిలు నెగిటివ్ కామెంట్స్ చేసారు.’నువ్వేం పీకుతున్నావ్ ? నువ్వేను చేయలేవా ? నువ్ ఇవ్వలకే మమల్ని అడుగుతున్నావా అంటూ కామెంట్ చెయ్యడంతో వారికి బుద్ది చెప్పే పని చేసింది మాధవి లత ‘ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉన్నాడని వాళ్ళని ఆదుకోమని హెల్ప్ అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారా ? వచ్చిన 26 కామెంట్స్ లో 20 నెగిటివ్ గా కామెంట్స్ చేశారు..9వద్దు లెండి మేము ఇక్కడ ఆ తిట్లు చెప్పాలము)ఇలా నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళని పేజీ నుంచి వెళ్లపోమ్మని చెప్పారు..అందరిని బాన్ చేస్తున్నా అని కూడా ఒక వీడియో విడుదల చేస్తూ..చెప్పారు.