సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే మహేశ్ బాబు తర్వాత భారీ సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు.
అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఒక ప్రాజెక్ట్ ఉంది. అయితే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగతో తర్వాతి సినిమా చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మహేశ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మహేశ్ బాబు గురించి సందీప్ వంగ ఒక పవర్ఫుల్ స్టోరీ రాసి ఉంచారని పలు ఇంటర్వూల్లో తెలిపారు. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్లో ఫ్యాన్స్‌ను నచ్చేలా ప్రిపేర్ చేసుకున్నారు. అయితే మహేశ్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని సమాచారం.
మరి ఈ సినిమాలో మహేశ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తారనే వార్తల్లో ఎంతవరకు నిజమో తెలియదు. ఒకవేళ మహేశ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేసినట్లయితే ఫ్యాన్స్‌కి ఇక పండగే.