మెగాస్టార్ చిరంజీవి ఆరుపదుల వయసులో కూడా నిత్య కుర్రాడిలా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ యూత్ కి పోటీ ఇస్తున్నారు. ఈ సంవత్సరం చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే తాజాగా చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
అయితే కొద్దిగా గ్యాప్ తీసుకుని చిరంజీవి మళ్లీ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు. బింబిసారా వంటి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ వశిష్టతో చిరంజీవి మెగా 156 మూవీ ని తెరకెక్కించనున్నారు. బాహుబలి ప్రభాస్ కి హోమ్ బ్యానర్ అయిన యువి క్రియేషన్స్ నిర్మించనుంది. తాజాగా ఈ చిత్రం దసరా రోజున ప్రారంభోత్సవం జరుపుకుంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు.
అయితే ఈ సినిమా పంచభూతాల థీమ్ తో ఉంటుందని టాక్ నడుస్తుంది. చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకి ఈ సినిమాకి దగ్గర పోలికలు ఉంటాయని అంటున్నారు. ఇందులో కూడా చిరంజీవి దేవా, దానవ, పాతాళ, యక్ష, భూలోకాలన్నీ తిరిగి వస్తాడంట. ఈ లోకాలన్నీ ఓ పాప కోసం చుట్టి వస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా మృణల్ ఠాకూర్ ని ఎంచుకున్నట్లు టాప్ వినిపిస్తుంది.
చిరంజీవి వయసేమో 68 సంవత్సరాలు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వయసు 31 సంవత్సరాలు. మృణాల్ ఠాకూర్ ఇప్పటివరకు యంగ్ హీరోలు సరసన హీరోయిన్ గా నటించింది. అయితే చిరంజీవి సరసన హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు అనగానే ఇండస్ట్రీ జనమంతా కామెంట్లు చేయడం మొదలు పెడుతున్నారు. అంత పెద్ద హీరో సరసన చిన్న వయసు హీరోయిన్ ఏంటి అంటున్నారు.
కాగా ఈ సినిమాకి విశ్వంభర అనే టైటిల్ పరిశీలిస్తున్నారు అని వినికిడి.
Also Read:ఈ ఫోటోలో మెగా ఫ్యామిలీతో ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?