రోజా సెల్వమణి పాపులర్ తెలుగు వెటరన్ హీరోయిన్. తెలుగులో సూపర్ స్టార్స్ పక్కన హీరోయిన్ గా నటించిన రోజా తెలుగు వారందరికీ బాగా సుపరిచిత్రాలు. చిరంజీవి బాలకృష్ణ వంటి బడాస్టార్లు పక్కన కూడా రోజా నటించారు. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే రోజా ప్రతి ఒక్కరికి బాగా దగ్గరయింది మాత్రం జబర్దస్త్ కామెడీ షో ద్వారా మాత్రమే.
ఆ షోలో మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి రోజా జడ్జిగా వ్యవహరించేవారు. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్ షో ఎంత పాపులర్ అయిందో రోజా నాగబాబులు ఇద్దరు కూడా అంతే పాపులర్ అయ్యారు. తర్వాత వైసీపీలో జాయిన్ అవ్వడం 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రోజా బాగా బిజీ అయిపోయారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునే రోజా తర్వాత క్రమ క్రమంలో మినిస్టర్ కూడా అయ్యారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక శాఖ మంత్రిగా రోజా పనిచేస్తున్నారు.మీడియా ముందుకు వచ్చే ప్రతిపక్షాలను కౌంటర్ వెయ్యాలంటే రోజా తర్వాత ఎవరైనా అని చెప్పుకుంటారు. అయితే తాజాగా రోజు అతను ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏముంది ఆ పోస్ట్ లో ఉంటే… వైసిపి ప్రభుత్వం నిర్వహిస్తున్న గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. పుత్తూరు మున్సిపాలిటీలో ఎనిమిదో వార్డులో పర్యటిస్తున్న రోజా… అక్కడ ఒక చిన్న బాబు తో ఫోటో దిగి పోస్ట్ పెట్టారు.
చితికిన నేత కోసం చేయూత అంటూ ఆ పోస్టు ఉంది. నేత నెల పెన్షన్ రూ.1396.45 కోట్లు, నేతన్నలు నేస్తం ద్వారా ఇప్పటివరకు రూ.969.77 కోట్లు, గత ప్రభుత్వ బకాయిలతో కలిపి ఆప్కో కి రూ.468.84 కోట్లు, నాలుగేళ్లలో నేతనాల కోసం రూ.2835.06 కోట్ల వ్యయం ప్రభుత్వం ఖర్చు పెట్టినట్లుగా వివరించారు.తమ ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ గతంలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమం తాము చేస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు.
Also Read:విజయనగరం ట్రైన్ ప్రమాదానికి కారణం ఇదేనా..? ఈ చిన్న పొరపాటు వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా..?