విజయనగరం ట్రైన్ ప్రమాదానికి కారణం ఇదేనా..? ఈ చిన్న పొరపాటు వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా..?

విజయనగరం ట్రైన్ ప్రమాదానికి కారణం ఇదేనా..? ఈ చిన్న పొరపాటు వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా..?

by Mohana Priya

Ads

విజయనగరం జిల్లా వద్ద జరిగిన రైలు సంఘటన వల్ల ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో ఎంత మంది మరణించారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ఈ ఘటనలో దాదాపు 14 మంది తమ ప్రాణాలను కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి.

Video Advertisement

అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే అనుమానం అందరిలో నెలకొంది. ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణం ఏంటి అని అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు. ఈ ఘటన సిగ్నలింగ్ సమస్య వల్ల జరిగినట్టు అంటున్నారు.

vizianagaram train incident mistake

వివరాల్లోకి వెళితే, సమయం కథనం ప్రకారం, విశాఖ నుండి పలాస వెళ్లే రైలు సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్ మీద వెనుక విశాఖ నుండి రాయగడ ప్యాసింజర్ ట్రైన్ 6 గంటలకు బయలుదేరింది. ముందు వెళ్లిన పలాస ట్రైన్ కి సిగ్నల్ సమస్య ఎదురయింది. ఈ కారణంగా కంటకాపల్లి నుండి ట్రైన్ ట్రాక్ మీద చాలా నెమ్మదిగా వెళ్ళింది. ఈ లోపు రాయగడ ట్రైన్ వెనక నుండి వచ్చి ఢీ కొట్టింది అని అంటున్నారు.

vizianagaram train incident mistake

ఒక ట్రాక్ మీద సిగ్నల్ క్రాస్ కాకుండా రెండు రైళ్లు ఎలా పంపారు అనే విషయం మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అందులోనూ ముఖ్యంగా సిగ్నలింగ్ కారణంగానే ఇలాంటి ప్రమాదం జరిగింది అని అంటున్నారు. అంతే కాకుండా ఒక ట్రైన్ ఆగి ఉన్నప్పుడు, అదే దారిలో ఇంకొక ట్రైన్ వెళ్లేందుకు ఎలా అనుమతి ఇచ్చారు అనే విషయం మీద కూడా దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఆటో సిగ్నలింగ్ వ్యవస్థలో ఉన్న లోపం వల్ల రాయగడ ట్రైన్ మధ్యలో లైన్ లోకి వచ్చినట్టు చెప్తున్నారు.

vizianagaram train incident mistake

ఒకవేళ హై టెన్షన్ వైర్లు తెగిపడడం వల్ల ఇలాంటి సంఘటన జరిగితే, ఈ సమాచారాన్ని వెనుక వస్తున్న ట్రైన్ లకి కూడా అందిస్తారు. కానీ ఈ రెండు జరగలేదు. ఈ కారణంగానే ప్రమాదం సంభవించింది అని అన్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ వల్ల ఇలా జరిగిందా? లేకపోతే మానవ తప్పిదం వల్ల ఇలా జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు రాయగడ రైలుకి చెందిన కొన్ని బోగీలు గూడ్స్ రైలుని ఢీ కొట్టాయి. రెండు ప్యాసింజర్, గూడ్స్ రైళ్లతో కలిపి 7 బోగీలు ప్రమాదానికి గురయ్యాయి.

vizianagaram train incident mistake

ట్యాంకర్ గూడ్స్ మీదకి పలాస రైలుకి చెందిన రెండు బోగీలు దూసుకెళ్లాయి. దాంతో పట్టాలు పైకి లేచి దాని మీద తలకిందులుగా రైలు వెళ్ళింది. వెనుక నుండి ఢీ కొట్టిన రాయగడ రైలు ఇంజన్ మీదకి ఆ రైలు బోగీలు పైకెక్కి, పక్కనే ఉన్న గూడ్స్ ట్రైన్ ని ఢీకొన్నాయి. విశాఖ రాయగడ రైలులోని దివ్యాంగుల బోగి పట్టాలు తప్పి పొలాల్లోకి వెళ్ళింది. ఆ పక్కనే ఉన్న డి 1 బోగి వేగానికి కొంత భాగం విరిగిపోయి పైకి లేచింది.

vizianagaram train incident mistake

బాధితులకి సహాయం చేయడానికి హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ నంబర్లు ఇవే.

  • విజయనగరం కలెక్టరేట్‌: 94935 89157
  • విశాఖ కలెక్టరేట్‌: 90302 26621, 70361 11169, 08912 590102
  • కేజీహెచ్‌: 89125 58494, 83414 83151
  • వైద్యుడి నంబర్ (24 గంటలు అందుబాటులో ఉంటారు): 83414 83151
  • అత్యవసర విభాగం వైద్యుడు: 86883 21986

vizianagaram train incident mistake

రైల్వే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లు

  • విజయనగరం: 08922221206, 08922221202, 89780 80006
  • విశాఖ రైల్వే స్టేషన్‌: 08912 746330; 08912 744619; 81060 53051; 81060 53052; 85000 41670; 85000 41671
  • వాల్తేరు టెస్ట్‌ రూం: 89780 80805
  • శ్రీకాకుళం రోడ్డు: 08942286213, 08922286245
  • సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ : 89780 80815
  • వాల్తేరు డివిజన్‌: 08942286245, 08942286213
  • అలమండ, కంటకాపల్లి: 89780 81960
  • ఏలూరు: 08812232267
  • సామర్లకోట: 08842327010
  • రాజమహేంద్రవరం: 08832420541
  • తుని: 08854252172
  • భువనేశ్వర్‌: 06742301625, 06742301525, 06742303060, 06742303729 (టోల్‌ ఫ్రీ)

ఈ ట్రైన్ ప్రమాదంలో చనిపోయిన వారిని బయటికి తీయడానికి కట్టర్లు ఉపయోగిస్తున్నారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు, అలాగే సమాచారాన్ని అందించేందుకు రైల్వే అధికారులు, విశాఖ జిల్లా అధికారులు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ALSO READ : అమ్మో ఇంత పెద్ద పేరా…. ఏకంగా 157 అక్షరాలు…! స్కూల్ లో జాయిన్ అయితే ఎలాగో.?


End of Article

You may also like