పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడం భలే సరదా విషయం. పిల్లల తల్లిదండ్రులకు వారు కడుపున పడ్డప్పట్నుండి ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. పుట్టాక వారి జాతకాల ప్రకారం మంచి పేరు పెట్టడానికి తల మనకులవుతారు. కొంతమంది అదేమీ పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా నామకరణం చేస్తారు. మరికొందరైతే అమ్మానాన్నల పేర్లు దేవుడి పేర్లు అంటూ వాటిని కలుపుకుని పెడతారు. ఇలా పెద్ద పెద్ద పేరు పిల్లలకు పెట్టేస్తూ ఉంటారు.

Video Advertisement

కానీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు లేదా పుట్టిన తేదీ రిజిస్టర్ చేయించినప్పుడు ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి తాజాగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు ఓ జంట. తన కూతురుకు సుదీర్ఘమైన పేరు పెట్టి ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు స్పానిష్ డ్యూకో ఫెర్నాండో ఫ్రిట్జ్ జేమ్స్ స్టువర్ట్-సోఫియా అనే దంపతులు. ఏకంగా 25 పదాలతో ఉన్న పేరు పెట్టాడు.

సోఫియా ఫెర్నాండ అంటూ సాగే ఈ పేరులో దాదాపు 157 అక్షరాలు ఉన్నాయి.ఇంతకీ ఆ పేరెంటో తెలుసా…”Sofia frenanda Dolores cayetana Teresa Angela de la Cruz Micaela del santisimo sacramento del perpetuo Socorro de la santisima trinidad y de todos los Santos”ఈ పేరును రిజిస్టర్ చేసేందుకు స్పెయిన్ అధికారులు నిరాకరించారు.అంతేకాకుండా ఈ పేరును కుదించాలని స్పష్టం చేశారు. ఇంత పెద్ద పేరు పెట్టడానికి గల కారణం ఏంటని అడగగా తన బంధువులు పూర్వీకులు పేర్లు స్పష్టంగా వచ్చేలా తన కూతురికి ఈ పేరు పెట్టినట్లుగా తెలియజేశాడు.

ఇప్పుడు ఇంటర్నెట్ లో ఈ పేరును చూసిన వాళ్ళు చదివిన వాళ్ళు షాక్ అవుతున్నారు. పేరు పూర్తిగా చదివి పలకడానికే చాలా సమయం పడుతుంది రేపు ఆ అమ్మాయి పెద్దది అయ్యాకా తన తల్లిదండ్రులను తిట్టుకోకుండా ఉంటుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మన తెలుగువారిలో కూడా పెద్ద పెద్ద పేర్లు చూస్తూ ఉంటాం గానీ మరీ ఇంత పెద్ద పేరు ఎక్కడ చూసి ఉండం…!

Also Read:జైలులో ఉన్న ఖైదీలు ఇలా బహిరంగ లేఖలు రాయొచ్చా? రూల్స్ ఏంటి.?