అక్కినేని ఫ్యామిలీ మొత్తాన్ని స్క్రీన్ మీద చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఆశిస్తూ వచ్చారు ఆఖరికి ఆ కోరిక డైరెక్టర్ విక్రమ్ కుమార్ రూపంలో తీరింది.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 2014లో వచ్చిన “మనం” సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో అక్కినేని అభిమానులు పండగ చేసుకున్నారు. ఆ తరువాత 2016 లో కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో “సోగ్గాడే చిన్ని నాయనా”లో నాగార్జున, రమ్య కృష్ణ కలిసి నటించారు.
టాలీవుడ్ లో అక్కినేని నాగార్జునకి చాలా సంవత్సరాలు తరవాత సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో నాగార్జునాని పంచె కట్టులో, పాత తరం లుక్స్ లో ఆయన అభిమానులు అందరూ చూసి ఆనందించేలా తీర్చిదిద్దాడు కళ్యాణ్. ఆ సినిమా సక్సెస్ తర్వాత అదే ఫార్మాట్ లో నాగ చైతన్య, నాగార్జున హీరోలుగా మరో సారి బంగార్రాజు సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. ఇందులో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి “శ్యామ్ సింగరాయ్” తరువాత నాగ చైతన్యతో ఆడి పాడింది.
ఈ సినిమా టీజర్, ట్రైలర్ యూట్యూబ్ లో బాగా హిట్ అయ్యింది. వాసివాడి తస్సాదియ్యా సాంగ్ కొన్నాళ్ళు యూట్యూబ్ లో హల్ చల్ చేసింది. అయితే సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకొని అందరిని అలరించడానికి థియేటర్లలోకి వచ్చాడు బంగార్రాజు. ఈ సినిమా మాత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అంత సూపర్ డూపర్ హిట్ కాకపోయినా అక్కినేని అభిమానులు కి మాత్రం బాగానే నచ్చింది.
అయితే సంక్రాంతి కి రిలీజైన బంగార్రాజు సినిమాలో కొన్ని తప్పులు దొర్లాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తప్పులు దొర్లాయని చెప్పడమే కాకుండా ఏ ఏ సన్నివేశాల్లో ఆ తప్పులు ఉన్నాయో వివరిస్తూ వీడియో లు కూడా తయారు చేస్తున్నారు. ఈ తప్పులు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపనప్పటికీ అంతమంది కష్టపడి, అన్ని రోజులు చేసిన సినిమాలో తప్పులు దొర్లడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బంగార్రాజు సినిమాలో దొర్లిన ఆ తప్పులేంటో తెలుసుకోవడానికి ఈ కింది వీడియోను మీరు కూడా ఒకసారి చూసేయ్యండి.
watch video :
Also Read