బాహుబలి తరువాత హీరో ప్రభాస్ కి తన ఇమేజ్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. కొన్ని కోట్ల మంది అభిమానులని సంపాదించిపెట్టింది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అంటూ తేడా లేకుండా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు ప్రభాస్. దీనితో అయన చేసే సినిమాల పైన అమాంతం హోప్స్ పెట్టుకుంటున్నారు ఫాన్స్. దీని తగ్గట్టే ఆయన తన సినిమాలని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై మహా నటి వంటి బ్లాక్ బస్టర్ తీసిన నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఇంటెర్నేషల్ లెవెల్ లో సైన్టిఫిక్ ఫిక్షన్ సినిమా ని తీయబోతునన్టు ప్రకటించారు. ఇందులో బాలీవుడ్ నటీనటులు కూడా భాగస్వామ్యం అయ్యారు. ఈ సినిమాను ఇవాళ రామోజీ ఫిలిం సిటీలో స్టార్ట్ చేసారు చిత్రా యూనిట్. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ఫోటోలు ఇంకా బయకు రాలేదు.
ఈ సినిమా లో బిగ్ బి అమితాబ్ కూడా నటించబోతున్నారు. ఈ సినిమా గురించి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసారు అమితాబ్. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా లో నటిస్తుంన్నారు. షూటింగ్ చివరి దశలో ఉండగా సెప్టెంబర్ లో సినిమాని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు యూవీ క్రియేషన్స్. కెజిఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సాలార్ సినిమాలో కూడా నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
MAHESH BABU: ప్రొడ్యూసర్స్ కి వార్నింగ్ ఇచ్చిన మహేష్ ? దానికి కారణం అదేనా !