మెగా బ్రదర్ నాగబాబు ఫామిలీ నుంచి సినీ ఇండస్ట్రీ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్ కొణిదెల ‘నిహారిక’.’ముద్దపప్పు ఆవకాయ’ తెలుగు వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకి పరిచయం అయిన మెగా డాటర్. టాలీవుడ్ ప్రేక్షకులకి చేరువయ్యారు.ఇటీవలే పెద్ద నాన్న చిరంజీవి గారి సినిమా సైరా లో కూడా యాక్ట్ చేసారు.అంతే కాదు చిరు నెక్స్ట్ సినిమా ‘ఆచార్య’ లో కూడా నటించబోతున్నారు అని టాక్ నడుస్తుంది.సోషల్ మీడియా వేదిక అయిన ఫేస్బుక్,ఇంస్టాగ్రామ్ లలో నిహారిక కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ ఫాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటారు. అయితే ఇటీవలే నిహారిక పెట్టిన ఒక ఇంస్టాగ్రామ్ పోస్ట్.ఆసక్తికరంగా మారింది ఇంతకీ అ పోస్ట్ లో ఏముందంటే ‘మిస్ నిహ’ అంటూ కాఫీ కప్ మీద రాసి ఉంది ఇది దేనికి సంకేతం ఏదైనా హింట్ ఇస్తున్నారా ? Ms కాస్త MRS గా మారబోతున్నారా ?
https://www.instagram.com/p/CBidGnVJDBn/
చాల ప్రశ్నలనే రేకెత్తిస్తున్నాయి .దీనిపై ఒక క్లారిటీ రావాలంటే మరో కొన్ని రోజులు ఆగాలి మరి..ఇది చుసిన నెటిజన్స్ మేడం మీకు పెళ్లి ఫిక్స్ అయ్యిందా ?లవ్ మ్యారేజ్ ఆ ?? ఎవరు వరుడు ? లవ్ లో పడ్డారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇటీవలే నాగబాబు సైతం వరుణ్ తేజ్ కి నిహారిక కి అతి త్వరలో పెళ్లి చేయబోతున్నాం అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.