బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య సినీరంగాన్ని ఒక కుదుపు కుదిపేసింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ రంగంలో జరుగుతున్న అణిచివేతల మీద స్పందిస్తున్నారు.కెరీర్ పరంగా ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు అర్ధాంతరంగా ఇలా మరణించటం.చాల భాదకు గురిచేసింది.బాలీవుడ్ లోని కొందరు పెద్దలు సుశాంత్ ని పైకి రానివ్వకుండా చేసారని నెటిజన్స్ వాపోతున్నారు.దీనితో నెపోటిజం అన్ని ఇండస్ట్రీలలో ఉందా అనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తుంది.
గతం లో ఉదయకిరణ్ కూడా ఇలా అర్ధాంతరంగా ఆత్మ హత్యా చేసుకోవటం అప్పట్లో పెద్ద దుమారం రేగింది.అదలా ఉండగా..టాలీవుడ్ నటుడు యంగ్ హీరో నిఖిల్ అభిమానులతో ట్విట్టర్ లో కాసేపు ముచ్చటించారు.ఈ సందర్బంగా ఒక అభిమాని వేసిన ప్రశ్న ‘మీ సినీ ప్రయాణంలో మీరు నెపోటిజం ని ఎదురుకున్నారా ? జవాబుగా నిజంగా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురుకొనలేదు.నేను తెలుగు సినీ పరిశ్రమలో ఒక భాగం అయినందుకు గర్విస్తున్నా అంటూ..రిప్లై ఇచ్చారు
.సినీరంగంలోనే కాదు సంగీత ప్రపంచంలోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటూ..ఇటీవలే సింగర్ సోను నిగమ్ అతిత్వరలో ఇలాంటి మరణాలు మరిన్ని చూడబోతున్నాం అంటూచేసిన కామెంట్స్ తెలిసిందే.అంతే కాదు నటి పూనమ్ కౌర్ కూడా తనకు జరిగిన సంఘటన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు’నువ్వు చస్తే ఒక రోజు వార్తల్లో నిలుస్తావు అంటూ గురూజీ నిర్లక్షయంగా జవాబు ఇచ్చాడు అంటూ..చెప్పుకొచ్చింది