మెగా స్టార్ తమ్ముడు…అండ్ జన సేన నేత కొణిదెల నాగబాబు ఇటీవలే ఆయన చేసిన కొన్ని వివాదాస్పద ట్వీట్స్ పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి రాజకేయనేతల నుంచి..అటు ప్రజల వరకు తీవ్ర విమర్శల పాలు అవుతున్నారు.నాగ బాబు గాడ్సే కి మద్దతుగా ట్వీట్స్ చేయడమే కాకుండా..ఈరోజు ఇంకో అంశం మీద ట్వీట్స్ పెట్టారు..కరెన్సీ నోట్ల మీద గాంధీజి ని కాకుండా పీవీ నరసింహ రావు,ఏపీజే అబ్దుల్ కలం తదితరుల చిత్రాలలు ఉండాలంటూ ట్వీట్స్ పెట్టారు..ఈ వివాదం మరింత ముదరక ముందే పవన్ కళ్యాణ్ స్పందించారు.ఈ సందర్బంగా జనసేన పార్టీ తరపున లేఖ ని విడుదల చేసారు..
ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే ..contd pic.twitter.com/WNIpG6gsVO
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 19, 2020
‘జనసేన పార్టీలో లక్షలాదిగా ఉన్న కార్యకర్తలు, జన సైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వ్యక్తిగత అభిప్రాయాలే గానీ.. పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నా. గతంలో కూడా మీడియా ద్వారా ఇదే విషయాన్ని చెప్పా. ఈ మధ్య కాలంలో కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందిన కొందరు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నారు.
— Pawan Kalyan (@PawanKalyan) May 23, 2020
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవి. పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పార్టీ అభిప్రాయాలను, నిర్ణయాలను పార్టీ అధికారిక పత్రం ద్వారా మాత్రమే వెల్లడిస్తాం. కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో మనం ప్రజాసేవ తప్పమరే ఇతర అంశాల జోలికి వెళ్లవద్దని పార్టీ కార్యకర్తలను కోరుతున్నా. ఎవరూ క్రమశిక్షణను అతిక్రమించొద్దు” అని పార్టీ కార్యకర్తలకి నేతలకి చెప్పుకొచ్చారు..