సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. ఒక్కోసారి ఓవర్ నైట్ లోనే కొంతమంది నటులు ఎంతో పేరు తెచ్చుకుంటారు.
అలాంటి వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కొంతమంది నటులు మాత్రం ఎన్ని సినిమాలు తీసినా స్టార్డమ్ అనేది రాదు. ఇదిలా ఉండగా దర్శకుల విషయానికి వస్తే వారు ఒక హీరోతో సినిమా అనుకొని, చివరికి మరో హీరోతో కానీ హీరోయిన్ తో కానీ సినిమా చేస్తారు. ఇలాంటి మార్పు అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.
అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన భీమ్లానాయక్ మూవీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. భీమ్లా నాయక్ ను ముందుగా పవన్ తో తీయాలని అనుకోలేదట. ఈ సినిమా కోసం ముందుగా పలువురు హీరోలను కలిసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం..!భీమ్లానాయక్ సినిమా మలయాళం నుంచి రీమేక్ చేసి తెరకెక్కించారు. అయితే ఈ మూవీని ముందుగా రానా మరియు వెంకటేష్ కాంబినేషన్ లో తీయాలని భావించారట.

కానీ వీరి కాంబినేషన్ సెట్ కాక ఆ తర్వాత బాలయ్య మరియు రవితేజ కాంబోలో తీయాలని ఆలోచన చేసారట.కానీ వీరి కాంబినేషన్ కూడా కొన్ని కారణాల వల్ల సెట్ కాలేకపోయింది. అయితే ఒకరోజు నాగ వంశీ సోషల్ మీడియాలో అయ్యప్పన్ కోషియమ్ మూవీని చూసి ఆ వెంటనే త్రివిక్రమ్ కు కాల్ చేసి సినిమా చేద్దాం బాగుంది అని అన్నారట. వెంటనే త్రివిక్రమ్ రీమేక్ రైట్స్ తీసుకోవాలని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఈ మూవీ చేస్తే విజయవంతమవుతుందని చెప్పారని తెలుస్తోంది.

వీరు పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఆయన ఓకే చెప్పారట. ఇక మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన పాత్ర ఎవరైతే బాగుంటుందనే సందిగ్ధంలో రవితేజను తీసుకోవాలని అనుకున్నారట. కానీ రవితేజకు డేట్స్ దొరక్కపోవడంతో రానా ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగులో ఎంతటి హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే.



ఈయన పుత్రుడు సంజయ్ రావు “ఓ పిట్ట కథ” అనే మూవీ ద్వారా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. దీంతో సంజయ్ అంతగా ప్రేక్షకులను దగ్గర కాలేకపోయాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అప్పటినుండి సంజయ్ ఏ సినిమాలో రాలేదు. అయితే తాజాగా తన తదుపరి సినిమాకు సంబంధించి అప్డేట్ రిలీజ్ అయింది.
అలాగే మిమ్మల్ని పెళ్లికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం అంటూ మోషన్ పోస్టర్ ను ముగించారు. అయితే ఈ సినిమాను పూరి జగన్నాథ్ శిష్యుడు ఏ ఆర్ శ్రీధర్ తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్నారు. మైక్ మూవీస్ బ్యానర్ పై వెంకట్ అన్నపురెడ్డి, అక్కిరెడ్డి నిర్మిస్తున్నారు.