Rashi Phalalu Telugu 2022: మనలో చాలామందికి జాతక ఫలితాలపైన నమ్మకం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కానీ, ఎప్పుడైనా వీటి గురించిన వివరం కనిపిస్తే ఒకసారి మన రాశి ఫలితాలని కూడా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే.. మన జీవితంలో రేపు ఎలా ఉంటుంది అనేది మనకి అస్సలు తెలియదు.
కానీ.. చూచాయగా.. ఇలా జరగచ్చు అని మనకి ఓ అవగాహనని కలిగిస్తాయి ఈ రాశి ఫలాలు. అందుకే వాటిని తెలుసుకోవడం ద్వారా సమయం వచ్చినప్పుడు.. మన పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడమో.. ప్రవర్తనని మార్చుకోవడమో చేస్తుంటాము. తద్వారా మన జీవితంలో ఉత్తమ ఫలితాలను పొందుతాము.
ఇక రాబోయే కొత్త ఏడాది మేష రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. 2022 వ సంవత్సరం మేష రాశి వారికి అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాలు ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో రానున్నాయి. అలాగే.. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఉత్తమ ఫలితాలు కలగబోతున్నాయి.
వీరికి సూర్యుడు మకర రాశిలో శని గ్రహంతో కలిసి ఉంటాడు. దీనివల్ల మేష రాశి వారికి తండ్రితో బేధాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. వీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ తండ్రి మీ విషయంలో ఏదైనా చెప్పినా.. మీరు సానుకూలంగా స్పందించడం అలవాటు చేసుకోండి. తద్వారా భవిష్యత్ లో మీ ఇద్దరి మధ్య దూరం పెరగకుండా ఉంటుంది.
ఇక ఈ రాశి వారికి వివాహం కూడా కలిసి వస్తుంది. వీరి జీవిత భాగస్వామి అదృష్టవంతులు అవుతారు. మొదటి మూడు నెలలు విద్యార్థులకు అనుకూలిస్తుంది. ఏప్రిల్ తరువాత సామాజిక గౌరవం మరింతగా పెరుగుతుంది. ఏప్రిల్ నెలాఖరు నాటికీ శని కుంభ రాశిలో సంచారం చేయడం వలన గతంలో మీరు పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుంది. అయితే..కేతువు ఏడవ గృహంలో ఉండడం వలన వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమస్యకి మీ చేతుల్లోనే పరిష్కారం ఉంటుంది. కాబట్టి సమయానుకూలంగా ప్రవర్తించి మీ సమస్యలని పరిష్కరించుకోవాలి.