డైరెక్టర్ పరుశురాం తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ టాప్ డైరెక్టర్లలో ఈయన కూడా చేరిపోయారని చెప్పవచ్చు. ఈయన ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో చాలా సినిమాలు బంపర్ హిట్ కొట్టాయి. డైరెక్టర్ పరుశురాం ఇప్పటి వరకు ఆరు సినిమాలు చేశారు. ఇందులో చాలా సినిమాలు విజయవంతమయ్యాయి.
పరశురామ్ మొదటగా డైరెక్ట్ చేసిన సినిమా యువత.. బంపర్ హిట్ కొట్టింది.. ఆయన తర్వాత చేసినటువంటి సినిమా ఆంజనేయులు, ఈ సినిమా అంతగా హిట్ కొట్టకపోయినా సరే ఆవరేజ్ మాత్రం నడిచింది. ఆయన తీసిన మూడవ సినిమా సోలో..
బంపర్ హిట్ అయ్యింది. ఆయన మళ్లీ తీసినటువంటి హీరో సారోచ్చారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. తర్వాత వచ్చిన సినిమా శ్రీరస్తు శుభమస్తు ఇది విజయవంతం అయింది. దీని తర్వాత తీసిన సినిమా గీత గోవిందం ఈ సినిమా మాత్రం ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించింది. దీంతో ఈ డైరెక్టర్ చాలా ఫేమస్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో ముందుకు రాబోతున్నారు. అదే సర్కార్ వారి పాట. ఈ సినిమా త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా చాలా బిజీగా ఉన్నారు మూవీ యూనిట్.. స్టార్ హీరో మహేష్ బాబు కంటే ముందు పరశురామ్ మరొక స్టార్ హీరోతో రెండు సినిమాలు చేశారు.. ఆయనే మాస్ మహారాజా రవితేజ.. ఈ హీరోతో ఆంజనేయులు సినిమా, మరియు సారొచ్చారు సినిమా చేసి తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు డైరెక్టర్ పరుశురాం.