మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతోన్న ఖిలాడీ చిత్రాన్ని రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. రమేష్ వర్మ తొలుత రైడ్, వీర వంటి చిత్రాలు డైరెక్ట్ చేసినా రాక్షసుడు సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు.

Video Advertisement

తమిళంలో సూపర్ హిట్ అయిన రాక్చసన్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన రాక్షసుడు డీసెంట్ సక్సెస్ ను అందుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం తన కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది.

ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించాడు రమేష్ వర్మ. కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో రాక్షసుడు 2 ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ చిత్రం భారీ స్కేల్ లో ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందనుంది. ఒక టాప్ హీరో లీడ్ రోల్ లో నటిస్తాడు. మరి ఆ హీరో తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాడేనా కాదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లండన్ లో మొదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. మరి ఈ థ్రిల్లర్ సీక్వెల్ లో ఎవరు హీరోగా నటిస్తారు అన్నది చూడాలి.