పూణే లోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం లో బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 173/8 స్కోర్ చేసింది. కోహ్లీ (30), డుప్లెసిస్ (38), కార్తీక్ (26), రాజత్ పాటిదార్ (21), లామ్రోర్(42) కీలక పరుగులు జోడించడంతో బెంగళూరు సీఎస్కే ముందు టఫ్ టార్గెట్ ఉంచింది. అయితే చేజింగ్ లో చెన్నై బ్యాటర్ లు తేలిపోయారు. డెవాన్ కాన్వే (56), మొయిన్ అలీ (34), పోరాటం చేసిన ఓటమి తప్పలేదు. 160/8 స్కోర్ కే పరిమితం కావడంతో బెంగుళూరు 13 పరుగుల తేడాతో గెలుపొందింది.3 వికెట్లు తీసి ఆర్సిబి విజయంలో కీలక పాత్ర పోషించిన హర్షల్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టుకు శుభారంభం దక్కింది.కోహ్లీ (30),డుప్లేసిస్ (38) దూకుడుగా ఆడటంతో ఆర్సిబి పవర్ ప్లే లో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. అనంతరం మొయిన్ అలీ వరుస ఓవర్లలో డుప్లేసిస్, కోహ్లీ లను అవుట్ చేశాడు. ఫస్టాఫ్ లో బ్యాటింగ్ కు వచ్చిన మ్యాక్స్ వెల్ (3)రనౌట్ గా వెనుతిరిగి నిరాశపర్చగా.. లామ్రోర్ బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ ఆడాడు.
తొలుత నిలకడగా ఆడినా ఆ తర్వాత బౌండరీలతో అలరించాడు. రాజత్ పాటిధర్ (21), దినేష్ కార్తీక్ (26 నాటౌట్) కీలక పరుగులు జోడించారు. చెన్నై బౌలర్ ముఖేష్ చౌదరి ఆఖరిలో బెంగళూరును ఇబ్బంది పెట్టాడు. 19వ ఓవర్లో లామ్రోర్ (42), హసరంగా(0), షాబాజ్ అహ్మద్(1) లను అవుట్ చేశాడు. ఆఖరి ఓవర్లో కార్తీక్ 16 పరుగులు రాబట్టడంతో బెంగళూరు చెన్నై ముందు టఫ్ టార్గెట్ నిర్దేశించింది.నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17