బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యి…జానీ సినిమా లో పవన్ సరసన నటించి పెళ్లాడిన హీరోయిన్ రేణుదేశాయ్…పెళ్లి తరువాత తిరిగి సినిమాలలో ఎక్కడ కనిపించని రేణు దేశాయ్…పవన్ తో విడాకులు తీసుకున్న తరువాత మళ్ళీ సినీ రంగం వైపు అడుగులు వేశారు..మరాఠి లో ఇష్క్ వాలా అనే సినిమాని కూడా నిర్మించారు తాజాగా తెలుగులో కూడా తిరిగి సినిమాలలో బిజీ అవ్వబోతున్నారు..
GMB ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మహేష్ బాబు నిర్మిస్తున్న’మేజర్’ సినిమాలో…ఒక పవర్ ఫుల్ రోల్ ని ఆఫర్ చేశారట..అయితే ఇంకా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.అడివి శేష్ హీరోగా..శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.ముంబై దాడుల్లో టెర్రరిస్టులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకు ఎక్కిస్తున్నారు.
ALSO READ : ఈమె ఎవరో గుర్తుపట్టారా? ఇంతలా ఎలా మారిపోయింది..?
పేరుకి చిన్న పాత్రనే అయినా కూడా పవర్ ఫుల్ రోల్ గా తెరకెక్కించే లా పాత్రను తీర్చిదిద్దబోతున్నారట..ఇప్పటికే రేణుదేశాయ్ దర్శకురాలిగా,నిర్మాతగా పలు సినిమాలను నిర్మించారు కూడా.రేణుదేశాయ్ ఫామిలీ కి అడివి శేష్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయట..ఒకేవేళ రేణు ఒప్పుకుంటే..ఇదో క్రేజీ ప్రాజెక్ట్ అవ్వడం మాత్రం ఖాయం