ఉత్తరాఖండ్ లోని సిల్క్ యార టన్నెల్ ఆపరేషన్ సక్సెస్ అయింది. 17 రోజుల తర్వాత 41 మంది కార్మికుల సొరంగా నుండి బయటకు వచ్చారు. ర్యాట్ హోల్ మైనర్లు అంటే బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులు అద్భుతం చేశారు.సోమవారం రాత్రి నుండి మెరుపు వేగంతో తవ్వకాలు చేపట్టిన 12 మంది 57 మీటర్లు డ్రిల్లింగ్ పూర్తి చేసి కూలీలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత గొట్టాన్ని పంపించి అందులో నుంచి కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చారు.
ఈ సిల్క్ యారా సొరంగంలో నవంబర్ 12న కార్మికులు పనులు చేస్తుండగా టన్నెల్ కొంత భాగం ఒక్కసారిగా కప్పు కూలింది. దీంతో 41 మంది కూలీలు అందులో చిక్కుకున్నారు. రెండు కిలోమీటర్లు పొడవైన సొరంగం ముందు భాగంలో 200 మీటర్ ల మూసుకుపోవడంతో బయటకు వచ్చే మార్గం లేకుండా పోయింది.
ఈ కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది 17 రోజులుగా అలుపెరగని పోరాటం చేశారు. తొలుత సొరంగలోకి రంధ్రం చేసి బయట నుండి తాగునీరు, ఆహారం, ఔషధాలు అన్ని పంపించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు.అయితే ఈ ర్యాట్ హోల్ మైనర్ బృందంలోని మున్నా ఖురేషి అనే వ్యక్తి ఈ ఆపరేషన్ లో హీరోగా నిలిచాడు. 29 ఏళ్ల ఈ రాట్ హోల్ మైనర్ ఢిల్లీలోని ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆ కంపెనీ వాటర్ లైన్స్ లో ఇరుక్కున్న మురికిని తొలగిస్తూ ఉంటుంది. 12 మీటర్ల సొరంగాన్ని తవ్వేందుకు ఒక డజన్ మంది ర్యాట్ హోల్ మైనర్లను ఉత్తరాఖండ్ తీసుకువచ్చారు.
మామూలుగా అయితే ఈ పద్ధతి ని 2014లో బ్యాన్ చేశారు. బొగ్గు తవడంలో ఇది అనుకూలంగా లేదని బ్యాన్ చేశారు.43 మంది కార్మికులు ఇరుక్కున్న సొరంగంలో ఆఖరి అడ్డును తొలగించింది మున్నా ఖురేషినే. ఒక్కసారిగా మున్నా ఖురేషిని చూసిన 41 మంది కార్మికులు అతన్ని హత్తుకుని కృతజ్ఞతలు తెలియజేసినట్లుగా తెలిపాడు. వాళ్లు ఇతనికి బాదం పప్పులు కూడా అందించారట. సొరంగం తవ్విన తర్వాత NDRF బృందాలు వచ్చేంతవరకు కూడా అరగంట పాటు కార్మికులతో కలిసి ఈ మైనర్ బృందం అక్కడే ఉన్నారు.
Also Read:ఈ ఫోటోలో ఉన్న ఈ యంగ్ “మెగా హీరో” ని గుర్తు పట్టారా..?