2023 వరల్డ్ కప్ టోర్నీ అంతా ఇండియాకి మంచిగానే జరిగిన ఫైనల్ మ్యాచ్ ఒకటి నిరాశ మిగిల్చింది. అయితే ఇప్పుడు వరల్డ్ కప్ అయిపోయింది. ఇండియన్ అభిమానులు అందరినీ వేధిస్తున్న ప్రశ్నల్లో ముఖ్యమైనది వచ్చే 2027 వరల్డ్ కప్ కి ప్రస్తుతమున్న టీంలో ఎంతమంది ఉంటారు అని. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఇండియన్ టీం లో చాలామంది సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. 2027 వరల్డ్ కప్ కి నాలుగేళ్ల సమయం ఉంది.
వయస్సు రీత్యా చాలా మంది అప్పటికి ఉంటారా లేక రిటైర్మెంట్ ప్రకటిస్తారా అన్న సందిగ్ధత నెలకొంది.ముఖ్యంగా చూసుకుంటే టీంలో ఆరుగురు విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఆ ఆరుగురు ప్లేయర్స్ ఎవరు అంటే….
1.సూర్య కుమార్ యాదవ్:
ఇండియన్ టీం లో ఉన్న సూర్య కుమార్ యాదవ్ వయసు 33 సంవత్సరాలు. వచ్చే 2027 వరల్డ్ కప్పు నాటికి సూర్య వయస్సు 37 సంవత్సరాలు అవుతుంది. వయసు పరంగా చూస్తే సూర్య 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉంది. కానీ పెర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం అవకాశం లేదు, ఎందుకంటే టి20 లో రాణించే సూర్య మొన్న వరల్డ్ కప్ లో మాత్రం బాగా నిరాశపరిచాడు.
2.షమీ:

సూర్య తర్వాత 33 సంవత్సరాల వయసులో ఉన్న మరో ప్లేయర్ మహమ్మద్ షమీ. షమీ మొన్న వరల్డ్ కప్ లో అద్భుతమైన పెర్ఫార్మన్స్ చూపించాడు. వయసు లెక్కన చూసిన పెర్ఫార్మన్స్ లెక్కన చూసిన శమీ 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉంది. అయితే అప్పటికి షమీ ఫిట్ గా ఉంటాడా లేదా అన్నదే ప్రశ్న.
3. రవీంద్ర జడేజా:

వరల్డ్ లోనే క్రికెట్ లో బెస్ట్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. ప్రస్తుతం జడేజా వయసు 34 సంవత్సరాలు. టీమిండియా కి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. వయస్సు పరంగా చూస్తే జడేజాకి 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉంది. స్పిన్ బౌలింగ్ కి కూడా టీంలో మంచి కాంపిటీషన్ ఉంది. జడేజా ఫిట్నెస్ మీద దృష్టి పెడితే టీమ్ లో చోటు దక్కించుకునే అవకాశం నిండుగా ఉంది.
4. అశ్విన్:

మొన్న వరల్డ్ కప్ ఆడిన మోస్ట్ సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్. టీంలోకి వస్తాడని ఎవరు ఊహించలేదు కానీ లాస్ట్ మినిట్ లో చోటు దక్కింది. అశ్విన్ వయసు 37 సంవత్సరాలు. 2027 వరల్డ్ కప్పుకి అసలు అవకాశం లేదు. సో మొదటగా రిటైర్డ్ అయ్యే ప్లేయర్ అశ్విన్ నే.
5. విరాట్ కోహ్లీ:

ఇండియన్ అభిమానులను వేధిస్తున్న పెద్ద ప్రశ్న 2027 వరల్డ్ కప్ కి విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అన్నది. మొన్న వరల్డ్ కప్పులో విరాట్ కోహ్లీ దుమ్ము దులిపేసాడు. విరాట్ కోహ్లీ వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు. 2027 వరల్డ్ కప్పు నాటికి 39 సంవత్సరాలు వస్తాయి. సచిన్ టెండూల్కర్ లెక్కన చూస్తే విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
6. రోహిత్ శర్మ:

ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ వయసు 36 సంవత్సరాలు. రోహిత్ 2027 వరల్డ్ కప్ ఆడతాడ అంతకన్నా ముందే రిటైర్ అవుతాడు అన్న ప్రశ్న కూడా అభిమానులను వేధిస్తుంది. 2027 నాటికి రోహిత్ కి 40 సంవత్సరాలు వస్తాయి. చాలామంది రోహిత్ 2027 వరల్డ్ కప్ కి ఉండడు అని అంటున్నారు.
Also Read:ఇదేందయ్యా ఇది…ఫైనల్ లో ఇండియా ఓడిపోయాక అంత మాట అన్నారు…ఇప్పుడు ఇలా ట్విస్ట్ ఇచ్చారు ఏంటి ఫాన్స్.?

కోచి వేదికగా ఈ నెల చివర్లో జరిగే వేలంలో 991మంది ఆటగాళ్ల పేర్లు నమోదు అయ్యాయి. నమోదు చేసుకున్న వారిలో వెస్టిండీస్ నుండి 33మంది ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఈ 33 మందిలో డ్వేన్ బ్రావో పేరు లేదు అని తెలుస్తోంది. బ్రావో పేరు లేదని తెలిసిన దగ్గర నుండి అతను కూడా ఐపీఎల్ రిటైర్మెంట్ చెప్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. డ్వేన్ బ్రావో ముంబై జట్టుతో తన ఐపీఎల్ ప్రయాణం మొదలుపెట్టాడు. 2011లో చెన్నై జట్టుతో కలిశాడు. ఇక అప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ 2011, 2012, 2021ల్లో ఐపీఎల్ ట్రోఫీ తేవడంలో ముఖ్యపాత్ర పోషించాడు.
ఇప్పటివరకు బ్రావో 161 ఐపీఎల్ మ్యాచులు ఆడి, 158 వికెట్లు తీసాడు. గత ఏడాదిలో పది మ్యాచులు ఆడి, 16 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ మినీ వేలానికి ముందు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది. అందులో భాగంగా పద్నాలుగు మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుని, మిగతా ఆటగాళ్లను వద్దనుకుంది. వదిలేసిన వారిలో డ్వేన్ బ్రావోతో పాటు జగదీశన్, రాబిన్ ఊతప్ప, ఆడమ్ మిల్నే,క్రిస్ జోర్డాన్ లాంటి వారు ఉన్నారు.